GossipsRRR బడ్జెట్.. బాహుబలి కాదు అంతకుమించి..!

RRR బడ్జెట్.. బాహుబలి కాదు అంతకుమించి..!

రాజమౌళి డైరక్షన్ లో మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమాగా RRR వస్తున్న సంగతి తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ విషయంలో ఓ క్లారిటీ వచ్చింది. ఓ పక్క ఎన్.టి.ఆర్, మరో పక్క రాం చరణ్ ఇండస్ట్రీ రికార్డులతో చెడుగుడు ఆడుకునే ఈ ఇద్దరిని కలిపి రాజమౌళి చేసే సినిమా ఎలా ఉంటుందో ఊహించవచ్చు.

ఇక ఈ సినిమా బడ్జెట్ కూడా అందుకు తగినట్టుగా ఉంటుందట. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా బడ్జెట్ దాదాపు 200 కోట్ల పైనే అంటున్నారు. బాహుబలి రెండు పార్టులను కలుపుకుని చేసిన బడ్జెట్ తో కేవలం ఒకే ఒక్క సినిమా చేస్తున్నారన్నమాట. అయితే ఎన్.టి.ఆర్, చరణ్ సినిమాకు ఆ మాత్రం లేకపోతే ఎలా అంటున్నారు విశ్లేషకులు.

బాహుబలి తర్వాత రాజమౌళి చేయబోతున్న ఈ సినిమాపై అంచనాలు నేషనల్ వైడ్ గా ఏర్పడ్డాయి. తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కే ఈ సినిమా ఈ ఇయర్ అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్తుందని తెలుస్తుంది. మరి బాహుబలిని టచ్ చేసే బడ్జెట్ తో వస్తున్న ఈ మెగా మల్టీస్టారర్ ఇండియన్ సినిమా హిస్టరీలో మిగిలిపోయేలా ఉంటుందని అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news