ట్రిపుల్ ఆర్ బడ్జెట్ ఎంతంటే..?షాక్ లో సినీ ఇండస్ట్రీ..!

16

బాహుబలి తర్వాత రాజమౌళి డైరక్షన్ లో మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా తెరకెక్కుతుందని తెలిసిందే. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో రాం చరణ్, ఎన్.టి.ఆర్ లు హీరోగా నటిస్తున్నారు. డిసెంబర్ నుండి సెట్స్ మీదకు వెళ్తున్న ఈ సినిమా బడ్జెట్ 250 కోట్ల దాకా ఉంటుందని తెలుస్తుంది. అంతేకాదు ఇదవరకు రాజమౌళి సినిమాలు బడ్జెట్ పరిమితులి ఉండేవి కావు షూటింగ్ మధ్యలో బడ్జెట్ పెంచేవారు.
4

3
అయితే ఈ సినిమాకు అలా కాకుండా ప్రతి విషయాన్ని చాలా క్లియర్ కట్ గా చూస్తున్నారట. బాహుబలికి ముందు ప్రభాస్ 50 కోట్ల హీరోనే బాహుబలి సినిమాతో వేయ్యి కోట్ల హీరోగా మార్చిన ఘనత రాజమౌళిదే. ఇక రానున్న ఈ మల్టీస్టారరర్ సినిమా కూడా కచ్చితంగా అంచనాలను మించి ఉండేలా చూస్తున్నారు.

SS Rajamouli  Ram Charan Jr NTR  new movie stills
SS Rajamouli Ram Charan Jr NTR new movie stills

1
ప్రస్తుతం చరణ్ బోయపాటి శ్రీను సినిమా చేస్తున్నాడు. ఎన్.టి.ఆర్ అరవింద సమేత సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ ఇద్దరు కలిసి చేసే సినిమా కోసం ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. పిరియాడికల్ నేపథ్యంతో రాబోతున్న ఈ సినిమా 2020 సమ్మర్ టార్గెట్ తో రానుంది.

Leave a comment