Gossips'RRR ' మూవీ టైటిల్ మారిపోయిందా ...?

‘RRR ‘ మూవీ టైటిల్ మారిపోయిందా …?

రాజమౌళి దర్శకత్వంలో టాప్ అండ్ యంగ్ హీరోలు ఎన్టీఆర్ – రామ్ చరణ్ మల్టి స్టార్ మూవీ ‘RRR’ మీద ప్రేక్షకులకు ఊహించని స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ఎందుకంటే… ఈ సినిమా డైరెక్టర్ ..హీరోలు ఇలా అంతా భారీ రేంజ్ క్రేజ్ ఉన్నవాళ్లే కావడం ఈ సినిమా మీద అంచనాలు పెరగడానికి కారణం అయ్యింది. అయితే సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్డేట్ ఒకటి ఇప్పుడు బయటకి వచ్చింది.

ఈ సినిమాకి టైటిల్ గా ‘రామ రావణ రాజ్యం’ అనే పేరు పెడుతున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కథ కూడా టైటిల్ కి తగ్గట్లే ఉంటుందనే టాక్ వినిపించింది. ఈ టైటిల్ పై చిత్రబృందం ఎలాంటి కామెంట్ చేయలేదు. ఇది ఇలా ఉండగా.. ఇప్పుడు ఇండస్ట్రీలో మరో టైటిల్ చక్కర్లు కొడుతోంది. అదేంటంటే.. ‘రాజసం’. అనే టైటిల్ మీద కూడా రాజమౌళి పరిశీలిస్తున్నట్టు ఫిలిం నగర్ సర్కిల్ లో గుసగుస లు వినిపిస్తున్నాయి.

అయితే గతంలో మహేష్ బాబు, వంశీ పైడిపల్లి సినిమా టైటిల్ అనౌన్స్ చేయకముందే ‘రాజసం’ అనే టైటిల్ తో అభిమానులు మహేష్ ఫోటో పెట్టి పోస్టర్లు క్రియేట్ చేశారు. ఇప్పుడు మళ్లీ ఈ టైటిల్ తెరపైకి వచ్చింది. అయితే ఇందులో ఎంత వాస్తవం ఉంది అనే విషయంపై ‘RRR’టీమ్ మాత్రం ఇంకా స్పందించాల్సి ఉంది. ఏమైనా ఈ అప్డేట్ పై ఫ్యాన్స్ లో మాత్రం కొత్త జోష్ కనిపిస్తోంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news