Gossipsయూత్ ని పిచెకిస్తున్న ‘రొమాంటిక్ క్రిమినల్స్’ ట్రైలర్!

యూత్ ని పిచెకిస్తున్న ‘రొమాంటిక్ క్రిమినల్స్’ ట్రైలర్!

ఈ కాలంలో యవ్వనం వచ్చిందంటే..అదేదో పట్టా వచ్చినంతగా ఫీల్ అవుతున్న వారు ఎంతో మంది ఉన్నారు. ఈ వయసు పోతే మళ్లీరాదు..ఇప్పుడే అన్నీ ఎంజాయ్ చేయాలి..అందుకోసం ఎన్ని తప్పుడు పనులైనా చేయాలి..ఎంతటి నీచమైన పనికైనా సిద్దపడాలి అన్న భావంతో కొంత మంది యూత్ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతిరోజూ ఎన్నో క్రిమినల్ వార్తలు వింటున్నాం..చూస్తున్నాం. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని తీసిన మూవీలా కనిపిస్తుంది ‘రొమాంటిక్ క్రిమినల్స్’. విపరీతమైన రొమాన్స్, డ్రగ్స్, బూతు డైలాగులతో టీజర్లు, ట్రైలర్లు రిలీజ్ చేసి యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు.

అయితే ఇలాంటి సినిమాల వల్ల లేని అలవాట్లు యూత్ నేర్చుకుంటారని..కొంత మంది పేరెంట్స్ గగ్గోలు పెడుతోన్నారు. ఎంత మంది ఆపినా..సెన్సార్ పూర్తి చేసుకొని ఇలాంటి సినిమాలు రిలీజ్ అవుతూనే ఉన్నాయి. ఇప్పటికే ఈ చిత్ర పోస్టర్లు విడుదలయ్యాయి. ముగ్గురు యువతులు ముఖానికి స్కార్ఫ్‌లు కట్టుకుని పొగతాగుతున్నట్టు ఉన్న ఆ పోస్టర్లు ఒక్కసారిగా అందరి దృష్టిని ఆకర్షించాయి. తాజాగా ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.

పాత్రధారులను చూపించకుండా కేవలం డైలాగులతోనే ఈ ట్రైలర్ సాగుతోంది. ట్రైలర్‌లో డైలాగులు బూతుకు పరాకాష్ఠలా ఉన్నాయి. ఇంజినీరింగ్ కాలేజీలో అమ్మాయిలు ఇంత దారుణంగా ఉంటారా? ఇలాంటి సినిమాలు మనకు అవసరమా? అనిపిస్తోంది ట్రైలర్‌ను చూస్తుంటే. యువతని పట్టి పీడించే వ్యసనాల ఇతివృత్తంగా ఇంజనీరింగ్ కాలేజీ స్టూడెంట్స్ నేపథ్యంలో సాగే కథ ఇది. హీరోగా మనోజ్ నందం, విలన్‌గా వినోద్, హీరోయిన్లుగా అవంతిక, దివ్య, వౌనికలు నటించారు.

https://youtu.be/FOh_79iHNaA

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news