Moviesరోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!

రోబో-2.o ప్యాన్ మేడ్ ట్రైలర్….15 మిలియన్ల వ్యూస్ దాటి అదరగొడుతుంది!!

The movie lovers are creating super works nowadays even sometimes it impresses the audiences more than the original works. Now coming to Robot 2.o fan made trailer crosses 15 million views and still trending. The work is awesome. The trailer is here have fun guys.

సినిమా దర్శకులకంటే సినిమా అభిమానుల్లోనే ఈ మధ్య ఎక్కువ క్రియేటివిటీ కనిపిస్తోంది. అదీ మరీ ముఖ్యంగా సోషల్ మీడియా జీవుల క్రియేటివిటీకి అయితే హద్దూ పద్దూ ఉండట్లదే. ఒక్కోసారి ఒరిజినల్ కంటే కూడా ఈ ఫ్యాన్స్ క్రియేటివిటీనే బాగుంటుందన్న మాట వాస్తవం. రజినీ-శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన రోబో సినిమా దేశవ్యాప్తంగా కూడా ఏ రేంజ్ సెన్సేషన్ క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడదే కాంబినేషన్‌లో ఆ రోబోకు సీక్వెల్‌గా రోబో-2.0 సినిమా వస్తోంది.

రోబోకి అదనంగా ఈ సినిమాలో బాలీవుడ్ యాక్షన్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ యాడ్ అవడంతో దేశవ్యాప్తంగా ఉన్న సినీ లవర్స్ అందరూ కూడా ఈ సినిమాపైన భారీ అంచనాలతో ఉన్నారు. దానికి తగ్గట్టుగానే సోషల్ మీడియా జీవులు ఆ క్రేజ్‌ని క్యాష్ చేసుకుంటున్నారు. అయితే ఆ ప్రయత్నంలో వాళ్ళ అద్భుతమైన క్రియేటివిటీ కూడా అందరినీ మెప్పిస్తోంది. ఇప్పుడు సోషల్ మీడియాలో రోబో-2.0 సినిమా ఫ్యాన్ మేడ్ ట్రైలర్ ఒకటి సర్కులేట్ అవుతోంది. అందులో రజినీ హీరోయిజం, విలన్ అక్షయ్ కుమార్, అలాగే అమీ జాక్సన్ అందాలను కూడా హాలీవుడ్ రేంజ్‌లో ప్రజెంట్ చేస్తూ సూపర్బ్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మిక్సింగ్‌తో ఉన్న ఈ వీడియో అందరినీ ఆకట్టుకుంటోంది. రోబో-2.0 యూనిట్ వాళ్ళే ఈ శాంపిల్ వీడియో వదిలారా? అనే రేంజ్‌లో ఉంది. ఇక ఈ క్రియేటివిటీని మించి ఉండేలా మన దర్శక దిగ్గజం శంకర్ రోబో-2.0 ట్రైలర్‌ని ఏ రేంజ్‌లో రూపొందిస్తాడో చూడాలి మరి. ప్రస్తుతానికి ఫ్యాన్ మేడీ ట్రైలర్‌ని చూసి మీరూ ఎంజాయ్ చేయండి.

https://youtu.be/XJW4UB83oaY

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news