టాలీవుడ్ స్టార్స్ కు భయపడుతున్న తలైవా.. 2.ఓ షాకింగ్ డెశిషన్..!

సూపర్ స్టార్ రజినికాంత్, శంకర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా 2.ఓ. రోబో సీక్వల్ గా 450 కోట్ల భారీ బడ్జెట్ తో వస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా రిలీజ్ ఫైనల్ గా ఏప్రిల్ లో ఉంటుందని ఎనౌన్స్ చేయగా ఇప్పుడు ఆ డేట్ న కూడా సినిమా రావడం కష్టమే అంటున్నారు. దీనికి కారణాలు గ్రాఫిక్స్ వర్క్ పెండింగ్ పడటమే కాకుండా తెలుగులో స్టార్ హీరోలకు పోటీగా ఈ సినిమా రిలీజ్ చేయడం కష్టమని మేకర్స్ భావిస్తున్నారట.

తెలుగులో ఏప్రిల్ లో మహేష్ భరత్ అనే నేను, అల్లు అర్జున్ నా పేరు శివ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. ఈ సినిమాలకు పోటీగా 2.ఓ రానుంది. అయితే కేవలం రిలీజ్ కు రెండు నెలలే ఉండటంతో ప్రమోషన్స్ ను టైం కుదరదని సినిమా మరో 2 లేదా 3 నెలలు వాయిదా వేస్తున్నారట. సో మొత్తానికి సమ్మర్ వార్ నుండి 2.ఓ తప్పుకుందని చెప్పొచ్చు.

ఇక ఇన్నాళ్లు రజిని సినిమా వస్తుందని తమ సినిమా రిలీజ్ విషయంలో కంగారు పడిన మహేష్, బన్నిలు క్లియర్ కట్ గా రిలీజ్ డేట్ ఎనౌన్స్ చేయొచ్చు. ఏప్రిల్ 27న రెండు సినిమాలు రిలీజ్ అంటున్నా ఒక సినిమా మాత్రం ఏప్రిల్ 14న రిలీజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి అది ఏ సినిమా అవుతుందో చూడాలి. తలైవా సినిమా వాయిదా తెలుగు సినిమాలకు క్లియరెన్స్ ఇచ్చినట్టు అయ్యింది.

స్టార్ హీరోలకు వణుకు పుట్టిస్తున భాగమతి కలెక్షన్స్

Leave a comment