ఆర్కే స్టూడియో అమ్మకం..మార్కెట్ వాల్యూ ఎంతో తెలుసా..!

ముంబై నగరంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఆర్కే స్టూడియోని అమ్మేందుకు కపూర్ ఫ్యామిలీ ఫిక్స్ అయ్యింది. ముంబైలోని చెంబూర్ ప్రాంతంలో 2 ఎకరాల్లో ఉన్న ఈ ఆర్కే స్టూడియో మార్కెట్ వాల్యూ ప్రకారంగా దాదాపు 500 కోట్ల దాకా పలుకుతుందట. ఇప్పటికే రిలయన్స్, వయాకం లాంటి వాటితో చర్చలు నడుస్తున్నాయట.

అయితే 500 కోట్లతో పాటుగా గుడ్ విల్ కింద మరో 100 కోట్లు రాబట్టాలని చూస్తున్నారు. కపూర్ ఫ్యామిలీలో గొడవలేమి లేకున్నా స్టూడియోని అమ్మేసి పంచుకోవాలని చూస్తున్నారు. ఆర్కే స్టూడియో దక్కించుకోవాలని రణ్ బీర్ కపూర్ తో కొంతమంది పొలిటికల్ లీడర్స్ కూడా చర్చలు నడిపిస్తున్నారట. మరి ఫైనల్ గా ఆర్కె స్టూడియో ఎవరికి దక్కుతుందో చూడాలి.

Leave a comment