నాకు  మైండ్ దొబ్బింది : రాంగోపాల్ వర్మ !

ram-gopal-varma

వర్మ అంటేనే వివాదాల సుడిగుండం. ఎప్పుడూ ఏదో ఒక కాంట్రవర్సీ ఉంటేనే కానీ ఆయనకు నిద్రపట్టదు. ఎప్పుడూ ఎవరో ఒకర్ని కెలుకుతూ వార్తల్లో నిలిచే వర్మ ఎప్పుడూ బయట వాళ్ళని అంటే కిక్ ఏముంటుంది అనుకున్నాడో ఏమో  కానీ ఇప్పుడు తనమీద తానే సెటైర్ వేసుకుని దటీజ్ వర్మ అని నిరూపించుకుంటున్నాడు.

నాగార్జున, రాంగోపాల్ వర్మ కాంబినేషన్‌లో నాలుగో సినిమా ప్రారంభమైంది. ఈ సినిమా షూటింగ్‌ను సోమవారం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడారు.

‘గత కొన్ని సంవత్సరాలుగా చాలా మంది అంటున్నారు. రాంగోపాల్ వర్మకి మైండ్ దొబ్బింది.. జ్యూస్ అయిపోయింది అని అందరూ అన్నారు. దాంట్లో మైండ్ దొబ్బింది అన్నమాట మాత్రం నిజం. కానీ జ్యూస్ అయిపోయిందా లేదా అనేది ఈ సినిమా తరవాత చూస్తారు’ అని వర్మ తన స్టైల్లో చెప్పుకొచ్చారు.

నాగార్జున తనపై ఉంచిన నమ్మకంతో తన కాన్ఫిడెన్స్ ఇంకా పెరిగిందని వర్మ చెప్పారు. ‘ఇన్ని సంవత్సరాల తరవాత ఒక కథ అనుకొని దాన్ని నాగార్జునకు వినిపించారు. ఆయన ఈ మధ్య మీడియాతో మాట్లాడుతూ కథ చెప్పినప్పుడు మళ్లీ పాత రాంగోపాల్ వర్మ కనిపించాడు. అదే ఇంటెన్సిటీ.. అదే నోవెల్టీ, సీన్స్, కథ ఏదైనా కావొచ్చు.

 

Leave a comment