Gossipsరష్మిక మోజులో పడ్డ మరో స్టార్ హీరో..

రష్మిక మోజులో పడ్డ మరో స్టార్ హీరో..

టాలీవుడ్ మొత్తం రష్మిక మాయలో పడ్డదంటే నమ్మాల్సిందే. కన్నడ భామ రష్మిక అక్కడ కిరాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ కాగా ఛలో సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇచ్చి గీతా గోవిందం సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకుంది. మూడు సినిమాలతోనే రష్మిక సూపర్ క్రేజ్ తెచ్చుకుందని చెప్పొచ్చు. అందుకే దర్శక నిర్మాతలే కాదు హీరోలు కూడా రష్మిక వెంట పడుతున్నారు. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక నితిన్ భీష్మ సినిమాకు సెలెక్ట్ అయ్యింది.

ఇదేకాకుండా అఖిల్ నాల్గవ సినిమాలో కూడా రష్మిక హీరోయిన్ గా నటిస్తుందని తెలుస్తుంది. గీతార్ ఆర్ట్స్ బ్యానర్ లో తెరకెక్కే ఈ సినిమాను బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేస్తున్నాడు. చాలా గ్యాప్ తర్వాత భాస్కర్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో అఖిల్ సరసన రష్మికను సెలెక్ట్ చేసే ఆలోచనలో ఉన్నారట. రష్మిక పేరు రికమెండ్ చేసింది కూడా అఖిల్ అని తెలుస్తుంది.

అఖిల్, హలో, మిస్టర్ మజ్ ను సినిమాలతో నిరాశపరచిన అఖిల్ ఈసారి పక్కా హిట్ ఫార్ములా సబ్జెక్ట్ తో వస్తున్నాడట. మరి రష్మిక లక్ ఫేవర్ తో అఖిల్ 4వ సినిమాతో అయినా హిట్ ట్రాక్ ఎక్కేస్తాడేమో చూడాలి. త్వరలో సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాకు ముందు డిఎస్పి మ్యూజిక్ అనుకోగా గోపిసుందర్ ను సెలెక్ట్ చేసినట్టు తెలుస్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news