మెగా హీరోతో రొమాన్స్ కి రెడీ అంటున్న రష్మిక..!

33

ఛలో సినిమతో సత్తా చాటిన రష్మిక ఆ తర్వాత వచ్చిన గీతా గోవిందం సినిమాతో కూడా సూపర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం డియర్ కామ్రేడ్ సినిమా చేస్తున్న రష్మిక మరోసారి విజయ్ దేవరకొండతో మ్యాజిక్ చేసేందుకు సిద్ధమైంది. ఇక ఇప్పుడు మెగా హీరో ఛాన్స్ కూడా పట్టేసిందని తెలుస్తుంది. మెగా మేనళ్లుడు సాయి ధరం తేజ్ హీరోగా పరశురాం డైరక్షన్ లో ఓ సినిమా డిస్కషన్స్ నడుస్తున్నాయి. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ గా సెలెక్ట్ చేశారట.

గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లోనే ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. పరశురాం గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే గీతా గోవిందం తెరకెక్కింది. ఇక ప్రస్తుతం సాయి ధరం తేజ్ చిత్రలహరి సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ నటిస్తున్నారు. మెగా నిర్మాతతో సినిమా చేసిన రష్మిక మొదటిసారి మెగా హీరోతో జతకడుతుంది. ఆ సినిమా హిట్ కొడితే ఇక వరుసగా మెగా ఛాన్సులు అందుకోవడం కామన్. సాయి ధరం తేజ్, రష్మిక ఇద్దరు కలిసి చేసే హంగామా ఎలా ఉంటుందో చూడాలి.

కన్నడ నుండి వచ్చిన రష్మిక తెలుగులో స్టార్ క్రేజ్ దక్కించుకునేలా ఉంది. చేసిన 3 సినిమాల్లో రెండు సూపర్ హిట్స్ కాగా రాబోయే క్రేజీ ప్రాజెక్ట్స్ కూడా పక్కా హిట్ కొడతాయని అంటున్నారు. ఇక తన సొంత భాషలో కూడా రష్మిక హవా కొనసాగిస్తుందని తెలుస్తుంది.

Leave a comment