ఫ్లాప్‌ హీరోతో రొమాన్స్ చేస్తున్న రష్మిక

44

టాలీవుడ్ లో ఉన్న హీరోయిన్స్ కొరత పుణ్యమాని ఒకటి రెండు సినిమాలు హిట్ కొడితే వారికి స్టార్ ఇమేజ్ ఇచ్చేస్తున్నారు. ఆ క్రమంలో కన్నడ నుండి వచ్చిన కిరాక్ పిల్ల రష్మిక మందన్నకు ప్రస్తుతం ఆఫర్ల వెళ్లువ వస్తున్నాయి. ఛలో, గీతా గోవిందం రెండు బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అమ్మడికి సూపర్ క్రేజ్ తీసుకొచ్చాయి. రష్మికతో సినిమా కోసం అడ్వాన్సులు పట్టుకుని మరి తిరుగుతున్నారు.

Rashmika-Mandanna-in-SS-Rajamouli-film
లేటెస్ట్ గా అమ్మడి ఖాతాలో మరో క్రేజీ ప్రాజెక్ట్ వచ్చి చేరింది. నితిన్ హీరోగా ఛలో డైరక్టర్ చేస్తున్న భీష్మ సినిమాలో రష్మిక ఛాన్స్ కొట్టేసిందట. ఛలో దర్శకుడు వెంకీ కుడుముల ద్వారానే తెలుగు పరిశ్రమకు పరిచయమైంది రష్మిక. ఆ దర్శకుడితో ఆల్రెడీ హిట్ కొట్టిన అమ్మడు మళ్లీ అతని డైరక్షన్ లోనే నితిన్ హీరోగా వస్తున్న సినిమాలో నటిస్తుంది. ఈ సినిమా శ్రేష్ఠ్ మూవీస్ బ్యానర్ లో నితిన్ ఫాదర్ సుధాకర్ రెడ్డి నిర్మిస్తారని తెలుస్తుంది.
3
అ ఆ తర్వాత సినిమాలైతే చేస్తున్న మళ్లీ హిట్ రేసులో వెనుకపడి ఉన్న నితిన్ ఈ సినిమాతో అయినా హిట్ కొడతాడేమో చూడాలి. రష్మిక ఎలాగు ఫుల్ ఫాం లో ఉంది కాబట్టి నితిన్ కు కచ్చితంగా హిట్ ఇస్తుందని అంటున్నారు.

1

Leave a comment