Gossipsఆహా... ఏమి ఛాన్స్ కోటింది ర‌ష్మీ

ఆహా… ఏమి ఛాన్స్ కోటింది ర‌ష్మీ

 

ఈటీవీలో వ‌స్తోన్న జ‌బ‌ర్ద‌స్త్ కార్య‌క్ర‌మం టీఆర్పీలో ఎలా దూసుకుపోతుందో వ‌రుస వార్త‌ల్లో నిలుస్తూ కూడా న్యూస్ హ‌బ్‌ని డిస్ట్ర‌బ్ చేస్తోంది. ర‌ష్మీ, అనుసూయ అనే ఇద్ద‌రు యాంక‌ర్ల టూ మచ్ ఆఫ్ ఎక్స‌పోజింగ్‌, వ‌ల్గ‌ర్ జోక్స్ ఈ షోకి ప్ర‌ధాన బ‌లం. ఎలా కాకున్నా ఎవ‌రు ఏమ‌న్నా ప‌ది మందీ న‌వ్విపోయినా న‌వ్వి పోదురు గాక మాకేమి వెర‌పు అన్న చందంగానే ఇప్ప‌టికీ అలానే సా..గుతోంది.

తాజాగా జ‌బ‌ర్ద‌స్త్ యాంక‌ర్లుగా ప‌నిచేస్తున్న ఆ ఇద్ద‌రిలో ఎవ‌రో ఒక‌రిని త‌ప్పిస్తార‌ని టాక్ వ‌చ్చింది. ర‌ష్మీని త‌ప్పించి హ‌రిప్రియ (బిగ్ బాస్ షో ఫేం)ని సీన్ లోకి ఎంట‌ర్ చేస్తార‌ని అంతా భావించారు కానీ అది త‌ప్పు అని తేలిపోయింది. ఆ వార్త నిజం కాద‌ని తేలిపోయింది.దీనిపై మ‌ల్లెమాల సంస్థ ఓ క్లారిటీ ఇచ్చింది.ఈ ప్రచారంలో వాస్త‌వ‌మే లేదని కొట్టిపారేసింది.ప్ర‌స్తుతానికి అనసూయ,

రష్మీల స్థానానికి వచ్చిన ప్రమాదం ఏమీ లేదని, వాళ్ల స్థానం సేఫ్ అని మల్లెమాల ప్రొడక్షన్ హౌజ్ వర్గాలు తెలిపాయి. సో.. ఎప్ప‌టిలానే ర‌ష్మీ అన‌సూయతో పాటు రోజా నాగ‌బాబు ఈ న‌లుగురూ ఉండ‌డం, పార్టిసిపెంట్స్ చేసే కామెడీ చూసి న‌వ్వ‌లేక ఏడ్వ‌డం, ఏడ్వ‌లేక న‌వ్వ‌డం మ‌న‌కిక త‌ప్ప‌దు….ఈ ఖ‌త‌ర్నాక్ కామెడీషోలో ఇంకెన్ని బూతులు వినాల్సి వ‌స్తుందోన‌ని భ‌య‌ప‌డ‌కండి. అవి అంతే మార‌వు,, యాంక‌ర‌మ్మ అంగాంగ ప్ర‌ద‌ర్శ‌నా మార‌దు మీరే ఛానెల్ మార్చేయాలిక ….

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news