బిగ్ బాస్ త్రీ కి బిగ్ షాక్ ఇచ్చిన రేణు దేశాయ్..

16

తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ కి మంచి ఆదరణ లభిస్తుంది. బిగ్ బాస్ సీజన్ 1 కి ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా చేశారు. ఆ సమయంలో ఇంటి సభ్యులతో సరదాగా సరదాగా గడిచిపోయింది. ఇక సెకండ్ సీజన్ కి నేచురల్ స్టార్ నాని వ్యాఖ్యాతగా వ్యవహరించారు. కానీ అది మొదటి సీజన్ అంత సక్సెస్ కాలేక పోయింది. మొదటి నుంచి ఇంటి సభ్యుల మద్య అభిప్రాయ భేదాలు..మాటల యుద్దాలు..కౌశల్ ఆర్మీ అంటూ నానా రభస మొదలైంది. అంతే కాదు నాని యాంకరింగ్ పై కూడా కొత్తలో విమర్శలు వచ్చాయి.

తాజాగా ఇప్పుడు బిగ్ బాస్ 3 సీజన్ రాబోతుంది. దీనిపై సోషల్ మీడియాలో రక రకాల కథనాలు వస్తున్నాయి. బిగ్ బాస్ సీజన్ 3 లో పవన్ మాజీ భార్య రేణ్ దేశాయ్ ఇంటి సభ్యురాలిగా పాల్గొంటున్నారని..ఇప్పటికే ఆమెగా బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదింపులు జరిపారని వార్తలు వచ్చాయి. అందుకు ఆమె అంగీకారం కూడా తెలిపారని సామాజిక మాధ్యమాల్లో ఊహాగానాలు వచ్చాయి.

తాజాగా ఓ ఆంగ్ల మీడియా ద్వారా రేణూదేశాయ్‌ ఈ వార్తలపై స్పందించారు. తాను బిగ్‌ బాస్‌ షోలో పాల్గొనడం లేదని స్పష్టం చేశారు. ప్రస్తుతం తాను ఓ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్‌తో బిజీగా ఉన్నానని, మళ్లీ నటించేందుకు సిద్ధమవుతున్నానని తెలిపారు.

ఇప్పటి వరకు తనను ఎవరూ సంప్రదించలేదని..ఒకవేల బిగ్ బాస్ 3 లో ఛాన్స్ వస్తే..ఇంటి సభ్యురాలిగా కాదు..యాంకర్ గా చేయాలని కోరిక ఉందని అన్నారు.మూడో సీజన్‌లో నాగార్జున కానీ, వెంకటేశ్ ‌గాని వ్యాఖ్యాతలుగా వ్యవహరించే అవకాశాలు ఉన్నాయి.

Leave a comment