బాలకృష్ణ, కళ్యాణ్ రామ్ మధ్య వివాదం పెరుగుతుందా ?

realation-between-balayya-and-kalyan-ram

నందమూరి హీరోల మధ్య దూరం పెరిగిందా అంటే అవుననే అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. బాలకృష్ణ ఒకవైపు, హరికృష్ణ కళ్యాణ్ రాం ఎన్.టి.ఆర్ మరో వైపు వచ్చారు. టిడిపిలో హరికృష్ణకు ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో తండ్రితో పాటు ఇద్దరు తనయులు ఆ విషయంలో హర్ట్ అయ్యారు. అప్పటిదాకా బాబాయ్ అంటే ఎంతో అభిమానం చూపించే కళ్యాణ్ రామ్ కూడా ఎన్.టి.ఆర్ కు దగ్గరయ్యాడు.

ఎన్.టి.ఆర్, కళ్యాణ్ రామ్ ఈమధ్య బాగా దగ్గరయ్యారు. బాలయ్య వీరిని దూరం పెట్టాడా లేక వీరే బాలయ్యను కాదనుకున్నారా అన్నది తెలియాల్సి ఉంది. కళ్యాణ్ రామ్ మాత్రం బాలకృష్ణ, ఎన్.టి.ఆర్ ల మధ్య సంధి కుదిర్చేలా చూస్తున్నా సెట్ అవట్లేదట. అందుకే ఈమధ్య తన మాటల ప్రస్థావనలో కూడా బాబాయ్ పేరు ఎత్తట్లేదు.

రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో తమ మధ్య దూరం పెరిగిందని చెప్పకనే చెప్పాడు కళ్యాణ్ రామ్. నా నువ్వే సినిమాతో ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు కళ్యాణ్ రామ్. తమన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను జితేంద్ర డైరెక్ట్ చేశారు. పిసి శ్రీరాం ఈ సినిమాకు కెమెరామన్ గా పనిచేశారు.

Leave a comment