కమెడియన్ పొట్టి రమేష్ భార్య త్రిపురాంభిక సూసైడ్ చేసుకోవడానికి అసలు కారణాలు ఇవే!

real reason behind comedian ramesh wife tripurambhika suicide case

Finally, the police officials find out the real reason behind dancer cum comedian potti ramesh wife tripurambhika suicide case. In the investigation it is revealed that ramesh parents and other family members tortured her every time for dowry.

డ్యాన్సర్, కమెడియన్ కూడా అయిన పొట్టి రమేష్ భార్య త్రిపురాంభిక తన నివాసంలోనే ఫ్యాన్‌కు ఉరేసుకుని సూసైడ్ చేసుకున్న విషయం తెలిసిందే. విశాఖపట్నం, గాజువాకలోని శ్రీనగర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. ఓ ప్రోగ్రామ్ నిమిత్తం రమేష్ హైదరాబాద్‌కి వచ్చిన సమయంలో త్రిపురాంభిక సూసైడ్ చేసుకుంది.

కూతురి మరణవార్త విని భోరున విలపించిన త్రిపురాంభిక తల్లి పుష్పలత.. రమేష్ కుటుంబసభ్యులు నిత్యం చిత్రహింసలకు గురిచేయడం వల్లే తన కుమార్తె సూసైడ్ చేసుకుందని ఫిర్యాదు చేసింది. కట్నం కోసం ఏడాదికాలంగా త్రిపురాంభికను సూటిపోటి మాటలతో వేధించారని.. అత్తమామలతోపాటు ఆడపడుచు మహాలక్ష్మి, ఆమె భర్త మల్లికార్జునరావును కఠినంగా శిక్షించాలని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు.. అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. విచారణలో భాగంగా ఆమె మృతికి అసలు కారణాలేంటో వెలుగుచూశాయి. అత్తింటివారి వేధింపుల వల్లే త్రిపురాంభిక బలవన్మరణానికి పాల్పడిందని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది.

కట్నం కోసం త్రిపురాంభికని తీవ్రంగా హింసించారని, సూటిపోటి మాటలతో నిత్యం వేధించారని తెలిసింది. వారి వేధింపులను ఏడాదిపాటు సహించిన త్రిపురాంభిక.. ఆత్మహత్య శరణ్యమని బలవన్మరణానికి పాల్పడింది. ఉదయం ఆరు గంటల సమయంలో బెడ్‌రూమ్‌లోకి వెళ్లి.. ఫ్యాన్స్‌కి చున్నీతో ఉరేసుకుంది. ఆరుగంటలకి రూమ్‌లోకి వెళ్లిన త్రిపురాంభిక ఏడున్నర అయినా బయటకు రాకపోవడంతో అత్తమామలు కిటికీలోనుంచి చూడగా.. ఆమె ఉరివేసుకుని కనిపించింది. ఆ దృశ్యం చూసి భయాబ్రాంతులకు గురైనా వాళ్లు.. ఆమెని గాజువాకలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అయితే.. త్రిపురాంభిక అప్పటికే మృతిచెందిందని వైద్యులు ధ్రువీకరించారు.

కాగా.. భర్త రమేష్‌ ఏనాడూ తన కూతురిని వేధించలేదని, ఈ కేసులో అతడిని చేర్చవద్దని పుష్పలత కోరింది. కానీ.. అప్పటికే సెక్షన్‌ 304 బి కింద కేసు నమోదు చేయడంతో పోలీసులు అందరినీ విచారిస్తున్నారు. రమేష్‌కు మంచి గుర్తింపు ఉండడంతో ఆయనకు మద్దతుగా అనేక మంది డ్యాన్సర్లు, నటులు స్టేషన్‌ వద్ద పడిగాపులు కాశారు. మృతదేహానికి కేజీహెచ్‌లో పోస్ట్‌మార్టం నిర్వహించారు.

Leave a comment