మాస్ మహరాజ్ రవితేజ “నేల టిక్కెట్టు” : ప్రీ రివ్యూ

nela-ticket-movie-prereview

మాస్ మహరాజ్ రవితేజ హీరోగా సక్సెస్ ఫుల్ డైరక్టర్ కళ్యాణ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న సినిమా నేల టిక్కెట్టు. ఎస్.ఆర్.టి మూవీస్ బ్యానర్లో తాళ్లూరి రాం ఈ సినిమాను నిర్మించగా శక్తికాంత్ మ్యూజిక్ అందించాడు. కొత్త అమ్మాయి మాళవిక శర్మ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా రేపు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది.

సినిమా టీజర్, ట్రైలర్ చూస్తుంటే తల్లిదండ్రుల మీద గౌరవం పెరిగేలా ఈ సినిమా ఉంటుందని తెలుస్తుంది. ప్రమోషన్స్ లో రవితేజ ఈ సినిమాలో హీరో, విలన్ ఇద్దరు అనాథలేనని లీక్ చేశాడు. అనాథే అయినా మంచి నడవడికతో సమాజం మీద గౌరం, ప్రేమ ఉన్న వ్యక్తిగా రవితేజ. అనాథగా తప్పు ఒప్పులు చెప్పే వారు లేక చిన్నప్పటి నుండి మూర్ఖంగా పెరిగిన విలన్ గా జగపతి బాబు నటిస్తున్నాడు.

సినిమాలో ఈ ఇద్దరి మధ్య సీన్స్ హైలెట్ గా ఉంటాయని తెలుస్తుంది. శక్తికాంత్ మ్యూజిక్ మంచి రిఫ్రెష్ మెంట్ గా ఉన్నాయి. ఇక అందానికి అందం, అభినయానికి అభినయం అన్నట్టుగా మాళవిక శర్మ ఈ సినిమాకు స్పెషల్ ఎట్రాక్షన్ కానుంది. టీజర్, ట్రైలర్ లో ఓ పక్క క్యూట్ గా చూపిస్తూనే సాంగ్స్ లో చెలరేగిపోయింది అమ్మడు.

సోగ్గాడే చిన్ని నాయనా, రారాండోయ్ వేడుక చూద్దాం సినిమాల తర్వాత కళ్యాణ్ కృష్ణ డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో డైలాగ్స్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చినట్టు తెలుస్తుంది.

ఓవరాల్ గా మహానటి కలక్షన్స్ తగ్గుముఖం పట్టిన ఈ తరుణంలో మంచి సినిమా వస్తే పక్కా హిట్టే అన్నట్టు ఉంది. మరి ఆ హిట్ సినిమా నేల టిక్కెట్టు అవుతుందా లేదా అన్నది రేపు తెలుస్తుంది. రాజా ది గ్రేట్ తర్వాత టచ్ చేసి చూడు ఫ్లాప్ అవగా ఈ సినిమా సక్సెస్ తో మళ్లీ హిట్ ట్రాక్ ఎక్కాలని చూస్తున్నాడు రవితేజ.

Leave a comment