Gossipsరష్మిక వార్నింగ్.. బన్నీ అంటే యాసిడ్ పోస్తా !

రష్మిక వార్నింగ్.. బన్నీ అంటే యాసిడ్ పోస్తా !

కన్నడ కిర్రాక్ పార్టీ సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయిన రష్మిన మందన తెలుగులో మొదటి సినిమా ఛలో హిట్ అందుకుంది. నాగ శౌర్యతో జతకట్టిన ఆ సినిమా అమ్మడికి తెలుగులో మంచి ఫాలోయింగ్ ఏర్పరచింది. ఇక ప్రస్తుతం విజయ్ తో గీతా గోవిందం అంటూ రాబోతుంది రష్మిక. అర్జున్ రెడ్డి తర్వాత విజయ్ దేవరకొండ క్రేజ్ ఏంటో అదరికి తెలిసిందే. అలాంటి క్రేజీ హీరో సరసన నటించింది రష్మిక.

రీసెంట్ గా గీతా గోవిందం ఆడియో వేడుకలో తాను మైక్ అందుకుని మాట్లాడుతున్న టైంలో ఆడియెన్స్ బన్ని, రౌడీ అని కేకలేశారు. రౌడీ అంటే విజయ్, బన్ని అంటే అల్లు అర్జున్ మాట్లాడాలని వారి కేకలు. అయితే తాను మాట్లాడే దాకా ఎవరైనా అరిస్తే వారి మీద యాసిడ్ పోస్తా అంటూ కామెంట్ చేసింది రష్మిక. సినిమాలో తన పాత్ర తాలూఖా ప్రవర్తనని ఆడియో వేదిక మీద కూడా కనబరచి అలరించింది రష్మిక. మొత్తానికి యాసిడ్ పోస్తా అని హీరోయిన్ అనడం హాట్ టాపిక్ గా మారింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news