రష్మీ గౌతమ్‌కీ తప్పని వేధింపులు.. రోజూ 50 మందికి పైగా అలా..

rashmi gautam harassed by 50 wrong calls everyday

Rashmi Gautam shares her bad experience which she still facing everyday. About 50 members harassing her daily.

ఏ స్థాయిలో ఉన్నా సరే.. అమ్మాయిలకు ఆకతాయిల నుంచి వేధింపులు తప్పవనడానికి రష్మీ గౌతమ్‌కి జరిగిన చేదు అనుభవాన్ని నిదర్శనంగా తీసుకోవచ్చు. ‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా రాత్రికిరాత్రే లైమ్‌లైట్‌లోకి వచ్చిన ఈ అమ్మడు.. భారీ ఫాలోయింగ్ సంపాదించింది. ఇటు యాంకర్‌గా, అటు సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ దూసుకెళుతోంది. ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అలాంటి ఈ అమ్మడు కూడా ఆకతాయిల వేధింపుల బారిన పడక తప్పలేదు. ఈ విషయాన్ని స్వయంగా రష్మీయే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

ప్రతిరోజూ తనకు 50 మంది నుంచి రాంగ్ కాల్స్ వస్తున్నాయని, వాళ్ళు తనని నిత్యం వేధిస్తున్నారని పేర్కొంది. ఫోన్ నెంబర్ మార్చుకుందామనుకుంటే.. నిర్మాతలు, దర్శకుల నుంచి తనకు కాంటాక్ట్ కట్ అయిపోతుందన్న భయంతో నెంబర్ మార్చలేకపోతున్నానని తెలిపింది. ఫోన్ చేసిన వాళ్ళని గట్టిగా తిడితే.. కేవలం మీ గొంతు వినడానికే ఫోన్ చేశామని, మీ టోన్ చాలా హాట్‌గా ఉందని చెప్పి ఫోన్ పెట్టేస్తున్నారని వాపోయింది. మరికొందరు ఆకతాయిలైతే బూతు మాటలు కూడా మాట్లాడుతున్నారని అమ్మడు చెప్పింది. ‘మీరు చాలా అందంగా ఉంటారండీ.. మీరంటే చాలా ఇష్టమండి’ అంటూ మాట్లాడుతున్నారని రష్మీ అంటోంది.

ఇలా ప్రతిరోజూ రాంగ్ కాల్స్ వస్తుండడంతో తాను చాలా ఇబ్బందికి గురి అవుతున్నానని, ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తోంది. రోజురోజుకి ఈ ఫోన్ కాల్స్ సంఖ్య మరింత ఎక్కువైపోతోందని రష్మీ వెల్లడించింది.

Leave a comment