ఎఫైర్ పై ఫైర్ అందాల రష్మీ రుస రుస …

reshmi

బుల్లి తెర యాంక‌ర్ ర‌ష్మీ తాజాగా సోష‌ల్ నెట్ వ‌ర్కింగ్ సైట్‌లో అభిమానులతో లైవ్ లో చాట్ చేసింది. ఈ సంద‌ర్భంగా  నెటిజ‌న్లు అడిగిన ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానాలిచ్చింది. ముఖ్యంగా సుడిగాలి సుధీర్ మీరూ పెళ్లి చేసుకుంటార‌ట‌గా అన్న రూమ‌ర్ ఆమె స్పందించిందింది.

”ప్రొఫెషనల్ గా మేం మంచి స్నేహితులం. వివిధ షోలలో ఈవెంట్స్ లలో కలిసి చేస్తూ.. ఉంటాం. సుదీర్ నాకు మంచి స్నేహితుడు. ఎదో షూటింగ్ మధ్యలో క్లోజ్ గా ఉంటాం. దానికే ఎదో రిలేషన్ ఉందని పెళ్లి చేసుకుంటారని చెప్పడం ఏమిటి?” అని మండిపడింది.

అంతే కాకుండా ఇతర న‌టీనటులతో కూడా తాను అంతే క్లోజ్ గా ఉంటానని  రష్మీ వివరించింది. మొత్తానికి గత కొద్ది కాలంగా జ‌బ‌ర్ద‌స్త్ షో పై అనేకానేక కామెంట్లు వ‌స్తున్న త‌రుణంలో ఆమె లైవ్ చాట్ ప్రాధాన్యం సంత‌రించుకుంది.అలానే రూమ‌ర్ల‌కు ఆమె స‌మాధానం ఇచ్చిన తీరు కూడా ఆలోచింప‌జేసేలా ఉంది అని ఆమె స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్న మాట‌!

 

Leave a comment