Newsమగవారిని భయపెడుతున్న రష్మీ

మగవారిని భయపెడుతున్న రష్మీ

బుల్లితెర యాంకర్ గా… జబర్దస్త్ కామెడీ షోతో పాపులర్ అయ్యి లక్షలాదిమంది అభిమానులను సంపాదించుకున్న రష్మి గౌతమ్ ప్రస్తుతం హీరోయిన్‌గా కూడా తన పెర్ఫామెన్స్ చూపిస్తూ వస్తోంది. అంతే కాదు…ముఖ్యంగా చిట్టి పొట్టి డ్రెస్ లతో హాట్ హాట్ అందాలను ప్రదర్శిస్తూ… చాన్స్ లు మీద ఛాన్స్ లు కొట్టేస్తూ …..ఈ హాట్ సుందరి వరుసగా బోల్డ్ క్యారెక్టర్స్ చేయడానికి కూడా ఎప్పుడూ రెడీ అన్నట్టుగా ఉంటోంది.

అయితే ఈ అమ్మడి ప్రస్తావన ఇప్పుడు ఎందుకు వచ్చింది అంటే… ఈ మధ్య కాలంలో ఈ హాట్ యాంకర్ సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటూ వస్తోంది. ఎప్పటికప్పుడు తన సినిమాలు, షోల వివారాలతో పాటు గ్లామరెస్ ఫోటోలను పోస్ట్ చేస్తూ కాకరేపుతోంది. ఈమె సంగతి కాసేపు పక్కనపెడితే… గత కొద్ది రోజులుగా ఆడవారి వస్త్రధారణ ఎలా ఉండాలనే దానిపై చర్చ పెద్ద ఎత్తున జరుగుతోంది. తాజాగా దీనిపై స్పందించింది రష్మి. ఇటీవలే మెగా బ్రదర్ నాగబాబు ఆడవారి వస్త్రధారణ గురించి మాట్లాడారు.తప్పు ఆడవాళ్ళ దుస్తుల్లో లేదని, మగవాళ్ళ కామం నిండిన చూపుల్లో ఉందని నాగబాబు ఫైర్ అయ్యారు. దీనిపై స్పందించిన రష్మి.ఆడవారికి మద్దతుగా మాట్లాడిన నాగబాబు గారికి ధన్యవాదాలు తెలిపింది.

అంతేనా…సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు దిమ్మతిరిగే రేంజ్ లో సమాధానం ఇచ్చి మగవాళ్ళంతా ముక్కున వేలేసుకునేలా ఘాటు రిప్లై పోస్ట్ చేసింది. ఇంతకీ విషయం ఏంటి అంటే…? మగవాళ్ళ డ్రెసింగ్‌లో మీకు నచ్చేవి ఏంటి అని ఓ అభిమాని ప్రశ్నించగా… నాకు షార్ట్స్ వేసుకుని కాళ్ళపై బొచ్చుతో తిరిగే వారంటే నాకు అస్సలు నచ్చదని షాకింగ్ రిప్లై ఇచ్చింది. అలాగే… కట్ బనీన్లు వేసుకొని చంకల్లో వెంట్రుకలు కన్పిస్తూ ఉన్నా నచ్చదని తేల్చి చెప్పింది.

అదేవిధంగా… హాఫ్ షర్ట్స్ వేసుకొని చేతులను ఓవర్‌గా ఎక్స్ పోజ్ చేసేవారు నచ్చరు. అదేవిధంగా … బీచుల్లో చొక్కా బనియన్లు లేకుండా వేలాడే చెస్ట్ తో అటూ ఇటూ తిరిగేవాళ్ళంటే అస్సలు నచ్చదని చెప్పుకొచ్చింది. ఇవేనా ఇంకా చాలా ఉన్నాయి. అవి అన్ని చెబితే మగాడు బయటికి తిరగడానికి కూడా భయం వేస్తుందని చెప్పి షాక్ ఇచ్చింది రష్మీ . ఆమ్మో ఈ అమ్మడు హాట్ అందాలు చూపించడమే కాదు … ఘాటు రిప్లై లు ఇవ్వడంలో కూడా బాగా తెలివిమీరిపోయింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news