రాశీఖన్నా స్టార్ తిరిగింది !

rashikanna

తెలుగు తెర మీద హావా అంతా ఈ మధ్య వచ్చిన కొత్త హీరోయిన్లదే. ఏ స్టార్ హీరోల పక్కన చూసినా వీరే కనిపిస్తున్నారు. ఇప్పుడు టాప్ హీరోయిన్లుగా కొనసాగుతున్న వారంతా ఒకప్పుడు చిన్న హీరోయిన్లుగా వెండి తెరమీద మెరిసినవారే. ఇదే కోవలో వచ్చిన హీరోయిన్ రాసి కన్నా.

అవసరాల శ్రీనివాస్ తొలిసారిగా దర్శకత్వం వహించిన ‘ఊహలు గుసగుసలాడే ‘సినిమాతో హీరోయిన్ గా అడుగుపెట్టిన ఈ అందాల భామ ఆ తరువాత సుప్రీమ్ సినిమాలో సాయిధరమ్ సరసన నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆ తరువాత తరువాత మెల్లిగా ఒక్కొక్క హిట్ సినిమాలో నటిస్తూ టాప్ రేంజ్ కి చేరుకుంది.

ఈ ముద్దుగుమ్మ కేవలం తెలుగులోనే కాదు ఈ మధ్య కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేసింది. ఇమైకా నోడిగళ్‌ చిత్రంలో అధర్వకు జంటగా ఈ అమ్మడు నటిస్తోంది. నయనతార ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటూ జనవరిలో విడుదలకు సిద్ధం అవుతోంది. జయం రవి ప్రస్తుతం శక్తి సౌందర్‌రాజన్‌ దర్శకత్వంలో టిక్‌ టిక్‌ టిక్‌ చిత్రంలో నటిస్తున్నారు. తొలి అంతరిక్ష కథా చిత్రంగా తెరకెక్కుతున్న టిక్‌ టిక్‌ టిక్‌ నిర్మాణ కార్యక్రమాలు పూర్తికావచ్చాయి.

తరువాత జయం రవి సుందర్ .సి దర్శకత్వంలో భారీ చారిత్రాత్మక కథా చిత్రం సంఘ మిత్రలో ఆర్యతో కలిసి నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్రం 2018 ఏప్రిల్‌లో సెట్‌పైకి వెళ్ళబోతున్నట్టు తెలుస్తోంది. దీంతో జయంరవి ఈ మధ్యలో ఒక చి త్రం చేయాలని నిర్ణయించుకున్నారట. తంగవేల్‌ దర్శకత్వంలో హోమ్‌ మూవీస్‌ సంస్థ నిర్మించనున్న మొదటి చిత్రంలో నటించనున్నారు. సీఎస్‌.శ్యామ్‌ సంగీతాన్ని అందించనున్నారు.

Leave a comment