Gossipsఅబ్బాయి పై బాబాయిదే పైచేయి..

అబ్బాయి పై బాబాయిదే పైచేయి..

క్రేజీ డైరక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. 1985లో జరిగే ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమా అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా తీస్తున్నారట. రంగస్థలం అంటే నాటికల వేదిక అనుకున్నారు.. కాని టైటిల్ జీవిత పోరాటం కూడా ఓ రంగస్థలమే ఇక్కడ కూడా అందరు పాత్రదారులమే అన్న కథాంశంతో ఈ సినిమా రాబోతుంది.ఇప్పుడీ సినిమా ప్రీ-రిలీజ్ బిజినెస్ ఓ రేంజ్ లో జరిగిపోతున్నట్టు సమాచారమ్.
రంగస్థలం శాటిలైట్ రైట్స్ రూ. 18కోట్లకు అమ్ముడుపోయాయి. ఈ మధ్యనే పవన్ – త్రివిక్రమ్ ల ‘అజ్ఝాతవాసి ‘ సినిమా శాటిలైట్ రైట్స్ రూ. 21కోట్లకి మ్ముడుపోయాయని సినీవర్గాలలో వినిపిస్తున్నాయి.ఈ లెక్కలని చూస్తుంటే నాన్ బాహుబలి ఫస్ట్ ప్లేస్ అని సినీవర్గాలలో ప్రచారం అవుతువుంది.
ఈ సినిమాలు తరువాత పవన్ తన రాజకీయ పనుల్లో బాగా బిజీ అయిపోతారు.రామ్ చరణ్ మాత్రం తన తండ్రి తీసే సైరా నరసింహ రెడ్డి సినిమా ప్రొడ్యూసర్ గ వహిస్తున్నారు.తరువాత ఈ సినిమా పనుల్లో రామ్ చరణ్ బిజీ గా వుంటారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news