రంగస్థలం టైటిల్ సాంగ్ (చిట్టి బాబు స్టెప్స్ అదుర్స్ )

rangasthalam title song

రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం సినిమా నుండి టైటిల్ సాంగ్ రంగస్థలం అంటూ సాంగ్ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు సంబందించిన సాంగ్ వీడియో ప్రోమో కొద్ది నిమిషాల క్రితం రిలీజ్ అయ్యింది. సినిమా కథకు తగినట్టుగా ఈ పాట సాగుతుంది. ఓ రకంగా ఇది సినిమా థీం సాంగ్ అని చెప్పొచ్చు.

ఇక ఈ సాంగ్ లో చరణ్ లుక్ అదిరిపోయింది. సాంగ్ కు తగినట్టుగా డ్యాన్సులతో కూడా అలరించాడు చరణ్. ఆడియో సాంగే సూపర్ హిట్ అవగా.. వీడియో మరింత హంగామా చేస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా చరణ్ కెరియర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలుస్తుందని అనిపిస్తుంది.

Leave a comment