Gossipsబన్ని హీరోయిన్ తో చరణ్ ఐటం సాంగ్..!

బన్ని హీరోయిన్ తో చరణ్ ఐటం సాంగ్..!

ఐరన్ లెగ్ హీరోయిన్ గా ముద్ర వేసుకున్న పూజా హెగ్దె డిజె హిట్ తో ట్రాక్ ఎక్కేసినట్టు అనిపిస్తుంది. డిజె లో అమ్మడు అందాలకు ఆడియెన్స్ ఫిదా అయ్యారు. ముకుంద, ఒక లైలా కోసం సినిమాలతో నిరాశ పరచిన అమ్మడు డిజె లో మాత్రం అందాలతో దుమ్ము దులిపేసింది. ఇక ఆ వెంటనే బెల్లంకొండ శ్రీనివాస్ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన పూజా ఇప్పుడు మరో లక్కీ ఛాన్స్ కొట్టేసిందని అంటున్నారు.

సుకుమార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న రంగస్థలం 1985 సినిమాలో అమ్మడు ఓ స్పెషల్ నెంబర్ చేస్తుందట. ఈ సాంగ్ కోసం బాలీవుడ్ భామలను దించుతారని అనుకున్నారు కాని ఫైనల్ గా పూజాకే ఆ ఛాన్స్ వరించింది. డిజెలో బికిని అందాలతో అలరించిన పూజా ఐటం సాంగ్ తో రెచ్చిపోనుందట. ఈమధ్యనే అమ్మడితో అగ్రిమెంట్ కూడా చేసుకున్నారట.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత లీడ్ హీరోయిన్ గా నటిస్తుంది. సుకుమార్ సినిమాలో ఐటం సాంగ్ అంటే చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇక ఆ సాంగ్ ఆఫర్ దక్కించుకున్న పూజా ఈ దెబ్బతో మరింత క్రేజ్ తెచ్చుకోవడం ఖాయమని అంటున్నారు.

 

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news