Moviesరంగస్థలం ఫస్ట్ డే కలక్షన్స్.. మెగా పవర్ బీభత్సం ఇది..!

రంగస్థలం ఫస్ట్ డే కలక్షన్స్.. మెగా పవర్ బీభత్సం ఇది..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కలిసి మొదటి కలయికలో చేసిన సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వచ్చిన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ముఖ్యంగా రాం చరణ్ నటనకు మంచి మార్కులు పడినట్టు తెలుస్తుంది. చిట్టిబాబుగా చరణ్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని అంటున్నారు.

ఇక ఈ సినిమా యూఎస్ ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ మార్క్ క్రాస్ చేయగా.. ఇప్పుడు వరల్డ్ వైడ్ గా రికార్డ్ ప్రైజ్ కలక్షన్స్ సాధించిందని తెలుస్తుంది. అందించిన సమాచారం ప్రకారం సినిమా మొదటి రోజు దాదాపు 30 నుండి 35 కోట్ల దాకా గ్రాస్ కలెక్ట్ చేసిందని అంటున్నారు. తెలుగు రెండు రాష్ట్రాల్లో మొదటి రోజు దాదాపు అన్ని థియేటర్స్ లో 100% ఆక్యుపెన్సీ సాధించింది.చరణ్ కెరియర్ లో మొదటి రోజు హయ్యెస్ట్ కలక్షన్స్ సాధించిన సినిమాగా రంగస్థలం సరికొత్త రికార్డ్ సృష్టించింది.

సమంత హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ పెద్ద అసెట్ గా నిలిచింది. రత్నవేలు సినిమాటోగ్రఫీ హైలెట్ గా నిలవగా సినిమా సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తుంది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news