రంగస్థలం అసలు రంగు బయటపడింద…

rangasthalam images

క్రేజీ డైరక్టర్ సుకుమార్ మెగా పవర్ స్టార్ రాం చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం 1985. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటిస్తుంది. 1985లో జరిగే ప్రేమకథగా రాబోతున్న ఈ సినిమా అప్పటి పరిస్థితులకు అద్దం పట్టేలా తీస్తున్నారట. రంగస్థలం అంటే నాటికల వేదిక అనుకున్నారు.. కాని టైటిల్ జీవిత పోరాటం కూడా ఓ రంగస్థలమే ఇక్కడ కూడా అందరు పాత్రదారులమే అన్న కథాంశంతో ఈ సినిమా రాబోతుంది.1 23

ఇక రీసెంట్ గా రంగస్థలం గ్రామ పంచాయితి కార్యాలయం అంటూ ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. కచ్చితంగా సుకుమార్ ఈ సినిమాతో ఓ ట్రెండ్ సృష్టించాలానే ఉన్నాడనిపిస్తుంది. నాన్నకు ప్రేమతో తర్వాత సుకుమార్ చేస్తున్న ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అందిస్తుందని అంటున్నారు. కొత్త చరణ్ ను చూస్తారని ఫ్యాన్స్ కు మాటిచ్చిన సుక్కు రంగస్థలంతో చెర్రికి బ్లాక్ బస్టర్ హిట్ ఇస్తాడేమో చూడాలి.4 5 6

దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో అనసూయ కూడా ఓ స్పెషల్ రోల్ ప్లే చేస్తుంది. మరి మేకర్స్ ఏమాత్రం కాంప్రమైజ్ కాకుండా చేస్తున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.9 10 8 7

Leave a comment