రంగస్థలం ఫస్ట్ రివ్యూ వచ్చేసింది..!

rangasthalam-first-review

రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో వస్తున్న ఈ సినిమాలో సమంత హీరోయిన్ గా నటించింది. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని సాంగ్స్ అన్ని ఇప్పటికే సూపర్ హిట్ అయ్యాయి. ఇక మరికొద్ది గంటల్లో రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి రివ్యూ వచ్చేసింది.

యూ.ఏ.ఈ సెన్సార్ సభ్యుడు ఉమర్ సంధు రంగస్థలం పూర్తి రివ్యూ రేటింగ్ ఇచ్చేశాడు. రాం చరణ్ చిట్టిబాబుగా పర్ఫార్మెన్స్ ఇరగదీశాడట. మాస్ మూవీగా ఈ సినిమా ఫస్ట్ క్లాస్ గా ఉందని అంటున్నాడు. సినిమా కథ కథనాలన్ని అద్భుతంగా ఉన్నాయన్న ఉమర్ సంధు సినిమాటోగ్రఫీ కూడా బాగుందని.. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కూడా సినిమాకు అదనపు ఆకర్షణగా నిలిచిందని అన్నారు.

ఇక ఉమర్ సంధు ఈ సినిమాకు 3.5 రేటింగ్ ఇచ్చాడు. అయితే ఉమర్ సంధు ఇదవరకు మన స్టార్ హీరోలకు ఇచ్చిన సినిమా రేటింగులకు సినిమా ఫలితం కు సంబంధం లేదు. మరి ఈ సినిమా అయినా ఉమర్ సంధు రివ్యూ నిజం అవుతుందో లేదో చూడాలి.

Leave a comment