బిజినెస్ అంటే రంగస్థలం దే.. చరణ్ రచ్చ మొదలు పెట్టినట్టే..!

ranagasthalam-business

మెగా పవర్ స్టార్ రాం చరణ్, సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. ఈ ఇయర్ రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీస్ లో ఇది ఒకటని చెప్పొచ్చు. మార్చి 30న రిలీజ్ ప్లాన్ చేసిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. టీజర్ కూడా అందుకు తగినట్టే ఉంది. ఇక సినిమా బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరుగుతుందట.

మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమా నైజాంలో అత్యధికంగా 18 కోట్లకు అమ్ముడయ్యిందట. యువి క్రియేషన్స్ వారు మొదటిసారి నైజాం రైట్స్ సొంతం చేసుకున్నారు. ఇక సీడెడ్ బళ్లారి ఏరియాల్లో సాయి కొర్రపాటి 12.06 కోట్లతో ఆల్రెడీ తీసుకున్నారట. ఇక ఆంధ్రాలోనే బిజినెస్ క్లోజ్ కాలేదట. ఇప్పటికే శాటిలైట్, రీమేక్ రైట్స్ కూడా మైత్రి మూవీస్ అమ్మేశారట.

చూస్తుంటే ఈ సినిమా 70 నుండి 80 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. సమంత హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు. మరి ప్రీ రిలీజ్ బిజినెస్ చూస్తుంటే చరణ్ రచ్చ మొదలు పెట్టినట్టే అంటున్నారు.

Leave a comment