గ్రాస్ ల్లో “రంగస్థలం” టాపు .. షేరుల్లో “భరత్ అనే నేను” తోపు.. భలే విచిత్రమైన లెక్కలు..!

Rangasthalam-bharat-ane-nen

ఈ ఇయర్ రెండు సూపర్ హిట్ సినిమాల మధ్య గట్టి పోటీ వచ్చింది. రాం చరణ్ రంగస్థలం తో సూపర్ హిట్ కొట్టగా.. మహేష్ భరత్ అనే నేను సినిమాతో బాక్సులు బద్ధలు కొట్టాడు. ఈ రెండు సినిమాలు ఫైనల్ కలక్షన్స్ లో నాన్ బాహుబలి రికార్డులను పక్కన పెడితే ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి. ముఖ్యంగా యూఎస్ లో ఈ రెండు సినిమాల ప్రభంజనం అంతా ఇంతా కాదు.

యూఎస్ లో గ్రాస్ కలక్షన్స్ లో రంగస్థలం మొదటి స్థానంలో ఉండగా షేర్ వాల్యూలో మాత్రం భరత్ అనే నేను ముందుంది. యూఎస్ గ్రాస్ కలక్షన్స్ లో రంగస్థలం 23.36 కోట్లు కలెక్ట్ చేయగా.. భరత్ అనే నేను సినిమా 22.71 కోట్లు వసూళు చేసి తర్వాత స్థానంలో ఉన్నాడు. అయితే యూఎస్ షేర్ వాల్యూలో భరత్ అనే నేను 13.65 కోట్లతో ముందుండగా రంగస్థలం మాత్రం 12.69 కోట్లు మాత్రమే కలెక్ట్ చేశాడు.

వరల్డ్ వైడ్ గా ఈ కలక్షన్స్ అన్ని టాలీవుడ్ క్రేజ్ పెంచుతుండగా తెలుగు సినిమా వసూళ్ల హంగామా చూసి తరణ్ ఆదర్శ్ యూఎస్ లో తెలుగు సినిమాల ప్రభంజనం గురించి బాలీవుడ్ కంటే ముందున్నారని ట్వీట్ చేశారు.

Leave a comment