5వ రోజు రంగస్థలం అదే దూకుడు.. రాం చరణ్ రికార్డుల ఊచకోత..!

rangasthalam-5-days-collections

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ కాంబోలో వచ్చిన సినిమా రంగస్థలం. రిలీజ్ అయిన మొదటి షో నుండి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకున్న ఈ సినిమా వసూళ్ల సునామి కొనసాగుతూనే ఉంది. సినిమా రెండు రోజుల్లో 50 కోట్లు 4 రోజుల్లో 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయగా వారం మధ్యలో కూడా వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది.

5వ రోజు అనగా మంగళవారం కూడా రంగస్థలం బాక్సాఫీస్ ను షేక్ చేసింది. తెలుగు రెండు రాష్ట్రాల్లోనే కాదు ఓవర్సీస్ లో కూడా మంచి వసూళ్లను రాబట్టింది. యూఎస్ లో రాం చరణ్ ఎన్నడు లేని విధంగా 2 మిలియన్ క్రాస్ చేసి 3 మిలియన్ సాధించేలా వసూళ్లు వస్తున్నాయి.

5వ రోజు వరకు రంగస్థలం పూర్తి కలక్షన్స్ ఎలా ఉన్నాయంటే :

నైజాం 14.28 కోట్లు

సీడెడ్ 9.70 కోట్లు

ఉత్తరాంధ్ర 6.79 కోట్లు

గుంటూర్ 5.51 కోట్లు

ఈస్ట్ 4.51 కోట్లు

వెస్ట్ 3.45 కోట్లు

కృష్ణా 4.04 కోట్లు

నెల్లూరు 1.81 కోట్లు

ఏపి/ టిఎస్ 5రోజుల వరకు 50.09 కోట్లు షేర్ కలెక్ట్ చేసింది.

Leave a comment