రంగస్థలం1985 టీజర్ ప్రత్యేకతలు ఇవే…

charan

మెగాపవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌, సుకుమార్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా రంగస్థలం 1985. ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. పూర్తిగా పల్లెటూరు బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ సినిమాను నిన్న మొన్నటి వరకు సంక్రాంతికి విడుదల చేయాలని భావించారు. అయితే సంక్రాంతికి పవన్‌ సినిమా ఉన్న కారణంగా వాయిదా వేయడం జరిగింది. పరీక్షల సీజన్‌ పూర్తి అయిన తర్వాత రంగస్థలంను విడుదల చేయాలని నిర్ణయించారు. ఇక ఈ సినిమాకు సంబంధించి ఇప్పటి వరకు అధికారిక లుక్‌ రివీల్‌ కాలేదు. ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఫస్ట్‌లుక్‌ టీజర్‌ కోసం ఎదురు చూస్తున్నారు.

చిత్ర యూనిట్‌ సభ్యుల నుండి అందుతున్న సమాచారం ప్రకారం ఈనెల చివరి వరకు టీజర్‌ను విడుదల చేయబోతున్నారు. అందుకోసం టీజర్‌ను రెడీ చేస్తున్నారు. ఇతర సినిమాల టీజర్‌తో పోల్చితే ఈ టీజర్‌ పూర్తి విరుద్దంగా ఉంటుందని చిత్ర యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. సినిమాలో చరణ్‌ పాత్ర ఏంటీ, సమంత ఎలా కనిపించబోతుంది అనే విషయాలను టీజర్‌లో విభిన్నంగా చూపించబోతున్నట్లుగా తెలుస్తుంది.

టీజర్‌ కోసం కొన్ని ప్రత్యేక షాట్స్‌ను షూట్‌ చేశారని, గతంలో ఏ తెలుగు సినిమాకు కూడా లేని విధంగా విభిన్నంగా టీజర్‌ను ప్లాన్‌ చేస్తున్నట్లుగా సమాచారం అందుతుంది. పల్లెటూరు కుర్రాడిగా చరణ్‌ కనిపించబోతున్నట్లుగా ఇప్పటికే లీక్‌ అయిన కొన్ని ఫొటోలతో తేలిపోయింది. ఇక సమంత లుక్‌ కూడా చాలా విభిన్నంగా ఉంటుందని సమాచారం అందుతుంది. మొత్తానికి రంగస్థలం సినిమా చరణ్‌ కెరీర్‌లో నిలిచి పోతుందని మెగా ఫ్యాన్స్‌ అంటున్నారు.

Leave a comment