Moviesశర్వానంద్ 'రణరంగం' రివ్యూ & రేటింగ్

శర్వానంద్ ‘రణరంగం’ రివ్యూ & రేటింగ్

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన సినిమా రణరంగం. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ అగర్వాల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమా ఎలా ఉందో ఈనాటి సమీక్షలో చూదాం.

కథ :

స్పెయిన్ లో గ్యాంగ్ స్టర్ గా బిజినెస్ లో టాప్ స్థానంలో ఉంటాడు దేవా (శర్వానంద్). తాను ఇప్పుడిలా ఉండటానికి కారణమైన తన గతాన్ని గుర్తు తెచ్చుకుంటాడు. తన గతంలో బ్లడ్, వయిలెన్స్ ఇవి తప్ప ఇంకేవి లేవని తెలుసుకుంటాడు. 1995లో తన మొదటి లవ్ ను గుర్తు చేసుకుంటాడు దేవా. ఇంతకీ దేవా ఫస్ట్ లవ్ ఎలా మిస్సయ్యాడు. అతనికి ఎదుగుదలలో జరిగిన పరిణామాలేంటి అన్నది సినిమా కథ.

నటీనటుల ప్రతిభ :

దేవాగా రెండు వేరియేషన్స్ ఉన్న పాత్రలో శర్వానంద్ బాగా చేశాడు. సినిమా మొత్తం శర్వానంద్ నటన హైలెట్ గా నిలుస్తుంది. కళ్యాణి ప్రియదర్శన్ చాలా క్యూట్ గా కనిపిస్తుంది. నటనతో ఆకట్టుకుంది. కాజల్ కూడా తన రోల్ కు పర్ఫెక్ట్ గా సూట్ అయ్యేలా చేసింది. ఇక మురళి శర్మ, అజయ్, బ్రహ్మాజిలు తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు :

సినిమాకు మ్యూజిక్ అందించిన ప్రశాంత్ పిల్లై ఇంప్రెస్ చేశాడు. సాంగ్స్ ఆకట్టుకున్నాయి. బిజిఎం ఓకే అనిపిస్తుంది. దివాకర్ మణి సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నవీన్ నూలి ఎడిటర్ బాగుంది. కథ, కథనాల్లో దర్శకుడు సుధీర్ర్ వర్మ ప్రతిభ మెచ్చుకోవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి.

విశ్లేషణ :

హీరో గ్యాంగ్ స్టర్ అవడం.. అతనికో ఫ్లాష్ బ్యాక్ ఉండటం.. ఇలాంటి కథలు చాలానే వచ్చాయి. శర్వానంద్ రణరంగం కూడా ఇలాంటి కథతోనే వచ్చింది. సినిమా అంతా రొటీన్ ఫార్ములాతో లాగించేశాడు దర్శకుడు సుధీర్ వర్మ. అయితే తెలిసిన కథగా ఉన్నా స్క్రీన్ ప్లే మాత్రం బాగా రాసుకున్నాడు. సినిమాలో కొన్ని బిల్డప్ సీన్స్ చాలా బాగా చూపించారు.

శర్వానంద్ ఇమేజ్ కు రణరంగం పర్ఫెక్ట్ సినిమా అని చెప్పొచ్చు. సినిమా ఫస్ట్ హాఫ్ క్యూట్ లవ్ స్టోరీ ఉంటుంది. ఆ తర్వాత సినిమా యాక్షన్ పార్ట్ లోకి వెళ్తుంది. శర్వానంద్ కంప్లీట్ మాస్ ఇమేజ్ కు ఈ సినిమా బాగా సహకరిస్తుంది. ముఖ్యంగా హీరో క్యారక్టర్ కోసం దర్శకుడు తీసుకున్న జాగ్రత్త బాగుంది.

హీరోయిన్స్ ఇద్దరు సినిమాకు సపోర్ట్ గా నిలిచారు. ఎంటర్టైనింగ్ తో పాటుగా సినిమా అంతా యాక్షన్ ఎంటర్టైన్ గా నిలిచింది. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు నచ్చే వారికి రణరంగం నచ్చేస్తుంది. సినిమాలో కొన్ని సీన్స్ మాత్రం శర్వానంద్ కెరియర్ బెస్ట్ సీన్స్ అని చెప్పొచ్చు.

ప్లస్ పాయింట్స్ :

శర్వానంద్

కళ్యాణి

సినిమాటోగ్రఫీ

యాక్షన్ సీన్స్

మైనస్ పాయింట్స్ :

ఫస్ట్ హాఫ్

మ్యూజిక్

స్క్రీన్ ప్లే

బాటం లైన్ :

శర్వానంద్ రణరంగం.. యాక్షన్ ఎంటర్టైనర్..!

రేటింగ్ : 2.5/5

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news