Movies" రణరంగం " ఫస్ట్ డే కలక్షన్స్..!

” రణరంగం ” ఫస్ట్ డే కలక్షన్స్..!

శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ డైరక్షన్ లో భారీ అంచనాలతో వచ్చిన సినిమా రణరంగం. కళ్యాణి ప్రియదర్శన్, కాజల్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా గురువారం రిలీజైంది. మొదటి షో నుండి మిక్సెడ్ టాక్ తెచ్చుకున్నా సాయంత్రం కల్లా సినిమా యావరేజ్ అనిపించుకుంది. ఈ సినిమా మొదటి రోజు కలక్షన్స్ శర్వానంద్ కెరియర్ లో హయ్యెస్ట్ గా నిలవడం విశేషం.

మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన రణరంగం సినిమా శర్వానంద్ కెరియర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ తో మెప్పించాడు. అయితే కథలో దమ్ము లేకపోవడం వల్ల కొద్దిగా నిరాశపరచింది. సుధీర్ వర్మ టేకింగ్ బాగుంది. సినిమాలో కళ్యాణి ప్రియదర్శన్ క్యూట్ యాక్టింగ్.. కాజల్ గ్లామర్ షో ప్లస్ అయ్యింది. రణరంగం ఫస్ట్ డే ఏపి, తెలంగాణా కలిపి 3.80 కోట్లు వసూళు చేసింది.

ఏరియా వైజ్ రణరంగం ఫస్ట్ డే కలక్షన్స్ ఎలా ఉన్నాయో చూస్తే :

నైజాం : 1.40 కోట్లు

సీడెడ్ : 0.47 కోట్లు

ఉత్తరాంధ్ర : 0.51 కోట్లు

గుంటూరు : 0.37 కోట్లు

ఈస్ట్ : 0.36 కోట్లు

వెస్ట్ : 0.28 కోట్లు

కృష్ణా : 0.23 కోట్లు

నెల్లూరు : 0.18 కోట్లు

ఏపి/తెలంగాణ : 3.80 కోట్లు

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news