Moviesమెగా పవర్ బాక్సాఫీస్ బీభత్సం ఇది..!

మెగా పవర్ బాక్సాఫీస్ బీభత్సం ఇది..!

మెగా పవర్ స్టార్ రాం చరణ్ సుకుమార్ కాంబినేషన్ లో వచ్చిన రంగస్థలం సినిమా బాక్సాఫీస్ పై తన దండయాత్రను కొనసాగిస్తుంది. సినిమా రన్ టైం ఎక్కువున్నా సరే చిట్టిబాబు నటనకు తెలుగు ప్రేక్షకులు నీరజనాలు పలికారు. రిలీజ్ అయిన మొదటి షో నుండి సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న రంగస్థలం 50, 100, 150 కోట్లను దాటుకుంటూ ఇప్పుడు 200 కోట్లకు చేరుకుంది.

200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ తో వసూళ్ల బీభత్సం సృష్టిస్తుంది రంగస్థలం. మార్చి 30న రిలీజ్ అయిన ఈ సినిమా మే 1 కార్మిక దినోత్సవం సందర్భంగా 200 కోట్ల పోస్టర్ రిలీజ్ చేశారు. 200 కోట్ల గ్రాస్ కలక్షన్స్ ఇంకా కౌంటింగ్ అంటూ పోస్టర్ వదిలారు. ధ్రువతో సక్సెస్ ట్రాక్ ఎక్కిన చరణ్ రంగస్థలం తో తన అసలు సిసలు స్టామినా ఏంటో చూపించాడు.

సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన ఈ సినిమా దర్శకుడి కెరియర్ లో కూడా హయ్యెస్ట్ కలెక్టెడ్ మూవీగా నిలిచింది. సినిమా కొన్న ప్రతి ఒక్క డిస్ట్రిబ్యూటర్ ను సంతోష పరచేలా ఉన్న రంగస్థలం వసూళ్లతో వారికి మంచి లాభాలు వచ్చేలా చేసింది.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news