Gossipsఅఖిల్ మీద భారీ ఆశలు పెట్టుకున్న రానా

అఖిల్ మీద భారీ ఆశలు పెట్టుకున్న రానా

అక్కినేని అఖిల్ తన 3వ సినిమాకు మరింత లేట్ చేయట్లేదని తెలుస్తుంది. రీసెంట్ గా విక్రం కుమార్ డైరక్షన్ లో హలో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన అఖిల్ తన థర్డ్ మూవీ కోసం కథా చర్చలు కొనసాగిస్తున్నాడు. ఇక ఈ సినిమా దర్శకుల రేసులో ఇన్నాళ్లు సుకుమార్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి లాంటి దర్శకుల పేర్లే వినిపించాయి. మొన్నామధ్య కోలీవుడ్ డైరక్టర్ అట్లీ పేరు కూడా ప్రచారంలోకి వచ్చింది.

అయితే ఇప్పుడు సడెన్ గా అఖిల్ 3వ సినిమా రేసులో డైరక్టర్ సత్య పినిశెట్టి వచ్చాడట. ఆది పినిశెట్టి సోదరుడైన సత్య ఆదితో మలుపు సినిమా తీశాడు. ఇక ఈమధ్యనే అఖిల్ కు సత్య ఓ కథ వినిపించాడట. కథ చాలా కొత్తగా ఉండటంతో అతనికి ఓకే చెప్పాడట అఖిల్. తన 3వ సినిమా ఎనౌన్స్ మెంట్ జనవరి 10 కల్లా చెప్పేస్తాడని హామి ఇచ్చిన అఖిల్ దాదాపు సత్య డైరక్షన్ లోనే సినిమా ఫిక్స్ అయ్యాడని అంటున్నారు.

ఇక ఈ సినిమా కథ ఓ సస్పెన్స్ థ్రిల్లర్ గా ఉంటుందని తెలుస్తుంది. ఈ సినిమాను రానా నిర్మిస్తాడని కూడా ఫిల్మ్ నగర్ లో ఓ వార్త వినిపిస్తుంది. అఖిల్ మొదటి సినిమ నితిన్ నిర్మించగా.. రెండో సినిమా నాగ్ ప్రొడ్యూస్ చేశాడు. ఇక ఇప్పుడు మూడవ సినిమా రానా నిర్మించడం విశేషమని చెప్పుకోవాలి.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news