400 మందిని రోడ్డున పడేసిన రామోజీ రావు..

21

రామోజి గ్రూప్ లో ఉద్యోగం అంటే అదేదో గవర్నమెంట్ జాబ్ అన్నట్టుగా ఫీల్ అయ్యే వారికి ఇది కచ్చితంగా షాకింగ్ న్యూసే. రీసెంట్ గా రామోజి గ్రూప్స్ నుండి ఒకటి రెండు కాదు ఏకంగా 400 మందిని తీసేశారట. వారి జీతభత్యాలు పిఎఫ్ సెటిల్ చేసి పింక్ స్లిప్ ఇచ్చేశారట. రామోజి రావు గ్రూప్స్ లో ఉద్యోగం చేస్తున్న అని గర్వంగా చెప్పుకునే కార్మికులకు సడెన్ గా దిమ్మతిరిగే షాక్ ఇచ్చాడు.

వందల మంది ఎంప్లాయీస్ తీసేంత కష్టం ఏమొచ్చిందో తెలియదు కాని ఈ నిర్ణయానికి రామోజి గ్రూప్స్ కార్మికులు కాస్త గుస్సుగా ఉన్నారు. ఇండియాలోనే అతి పెద్ద ఫిల్మ్ సిటీ అయిన రామోజి ఫిల్మ్ సిటీ ఓ పక్క సందర్శకులు, మరో పక్క సినిమా షూటింగులతో బిజీగా ఉంటుంది. రామోజి రావుకి నష్టాలున్నా అవి మరి ఎంప్లాయీస్ కు జీతాలివ్వలేనంత కాదు. మరి ఎందుకు ఇంతమందిని జాబ్ లోంచి తొలగించారు అన్నది తెలియాల్సి ఉంది.

ఈనాడు పేపర్, న్యూస్ ఛానెల్స్ లో పేదవారికి అండగా ఉండాలి.. అన్యాయం జరిగిన వారిని ఆదుకోవాలి అంటూ హితభోదలు చేసే రామోజి గ్రూప్ సంస్థలు కార్మికులను రోడ్డున పడేలా చేయడం ప్రస్తుతం అంతటా హాట్ న్యూస్ గా మారింది.

Leave a comment