ఎన్టీఆర్ లో మార్పు.. 30 ఏళ్ల తేడా కనిపిస్తుంది.. ప్రకృతి తలిస్తే ఏదైనా జరుగుతుంది..!

ntr-ramaprabha

టెంపర్ నుండి తన సినిమాల పంథాను మార్చేసిన యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ ఎంచుకున్న కథలు ఆ పాత్రల ద్వారా చెబుతున్న విషయాలను వంట పట్టించుకున్నాడు. అందుకే ఇదవరకు ఎన్.టి.ఆర్ కన్నా ఇప్పుడు ఈ తారక రాముడు మరింత విశిష్టతతో కనిపిస్తున్నాడు. ఈమధ్య మైకు పట్టుకుని ఎన్.టి.ఆర్ మాట్లాడే విధానం చూస్తే ఎవరైనా చెప్పేస్తారు.

ఈ విషయాన్ని మరోసారి గుర్తుచేశారు సీనియర్ నటి రమాప్రభ. ఎన్.టి.ఆర్ ఈమధ్య చాలా మారిపోయాడని చాలా పరిణితితో మట్లాడుతున్నాడని.. తాత్వికతతో కనిపిస్తున్నాడని అన్నారు రమాప్రభ. ఇక ముఖంలో రెండేళ్ళ క్రిందటికి ఇప్పటికీ ఓ 30 ఏళ్ల తేడా కనబడుతుందని అన్నారు. ఆయన్ను కలవాలనిపిస్తుంది.. అయితే కలవడానికి ఎవరు మధ్యవర్తిత్వం అవసరం లేదు. ప్రకృతి కలిపిస్తుంది. శూన్యమని అందరు అంటారు.. వైబ్రేషన్స్ కనిపిస్తాయి.. అదే తన నమ్మకమని.. దేవుడి భజనలు, పూజలు లాంటివి తనకు సరిపోవని అన్నారు రమాప్రభ. సంకల్పం బలమైనది అయితే మనం ఏమనుకున్నా అది జరిగి తీరుతుందని అంటున్నారు రమాప్రభ.

Leave a comment