Moviesచిరంజీవిని ఆకాశానికెత్తేశాడు రాంగోపాల్ వర్మ

చిరంజీవిని ఆకాశానికెత్తేశాడు రాంగోపాల్ వర్మ

Sensational director Ram Gopal Varma praises Chiranjeevi after watching Khaidi no 150 movie. He tweeted that, Chiru looking mega handsome in this film.

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా ‘ఖైదీ నెం.150’ షూటింగ్ జరుపుకుంటున్నప్పుడు.. రాంగోపాల్ వర్మ ఏదో ఒక విధంగా దానిపై సెటైర్లు వేస్తూ వచ్చాడు. ముఖ్యంగా.. పోస్టర్లు, టీజర్స్, ట్రైలర్ విడుదలైన ప్రతిసారీ తనదైన శైలిలో పరోక్షంగా విమర్శలు కురిపించాడు. కానీ.. ఇప్పుడు ప్రశంసల వర్షం కురిపిస్తున్నాడు. రీసెంట్‌గానే ‘ఖైదీ’ సినిమాని చూసిన వర్మ.. చిరంజీవిని ఆకాశానికెత్తేశాడు.

‘ఖైదీ సినిమా చూశాను.. మెగాస్టార్ ‘మెగా’కి సరిహద్దులు చెరిపేశారు. ఆయనకు 150 మిలియన్ సార్లు చీర్స్ చెబుతున్నా.. ఆయన ఎనర్జీ లెవెల్స్ ‘సుప్రీం’ స్థాయిలో ఉన్నాయి. పదేళ్ల కిందట సినిమాలకు దూరమైనప్పుడు చిరు ఎంత హ్యాండ్‌సమ్‌గా ఉండేవారో.. ఈ సినిమాలో అంతకంటే అందంగా, యంగ్ లుక్‌లో కనిపించారు. ఆయన మెగా హ్యాండ్సమ్‌గా తయారయ్యాడు’ అంటూ ట్విటర్ వేదికగా చిరంజీవిపై పొగడ్తల వర్షం కురిపించేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news