Gossipsజూనియర్ ఎన్.టి.ఆర్ గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు..!

జూనియర్ ఎన్.టి.ఆర్ గురించి వర్మ సంచలన వ్యాఖ్యలు..!

సంచలన దర్శకుడు రాం గోపాల్ వర్మ ఎప్పుడు ఏ విషయంపై ఎలా స్పందిస్తాడు అన్నది ఎవరికి తెలియదు. ప్రస్తుతం శుక్రవారం రిలీజ్ అవుతున్న లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ ప్రమోషన్స్ లో బిజీగా ఉన్న ఆర్జివి జూనియర్ ఎన్.టి.ఆర్ గురిచి సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఓ మీడియా ఇంటరాక్షన్ లో రాపిడ్ ఫైర్ క్వశ్చన్స్ లో ఎన్.టి.ఆర్ గురించి వర్మని అడిగితే తారక్ లోని ఎనర్జీ తనకు బాగా నచ్చుతుందని అన్నారు.

అంతేకాదు సీనియర్ ఎన్.టి.ఆర్ తర్వాత ఆ ప్రస్థానం కొనసాగించే ఏకైక హీరో ఎన్.టి.ఆర్ అటు రాజకీయాల్లో కూడా ఆయనే ఆయన పూర్వ వైభవం తెస్తారని అన్నాడు. ఇక ప్రశ్నోత్తరాల్లో భాగంగా చిరంజీవి అంటే ఏం గుర్తొస్తుంది అంటే మెగా అన్న వర్మ బాలకృష్ణ అనగానే లక్ష్మీస్ ఎన్.టి.ఆర్ అన్నాడు. వెంకటేష్ అనగానే క్షణ క్షణం అన్నాడు. మహేష్ అందమైన హీరో ట్రూ సూపర్ స్టార్ అనేశాడు.

ముఖ్యంగా అల్లు అర్జున్ గంగోత్రికి ఇప్పుడు తను అందుకున్న స్టార్ డం కు చాలా కష్టపడ్డాడని అన్నారు. అల్లు అర్జున్ ఈ స్థాయికి వస్తారని ఎవరు ఊహించలేదని వెళ్లడించారు. రంగస్థలం తర్వాత రాం చరణ్ మీద ఇష్టం పెరిగిందని అన్నారు. ప్రభాస్ అనగానే బాహుబలి అన్నారు. పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అని.. ఆయన సిఎం అయితే ఫ్రెంట్ పేజ్ లో అందమైన సిఎం ను చూడొచ్చని చెప్పారు వర్మ.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news