Gossips'ఎన్టీఆర్' కరుణిస్తాడా ...? గందరగోళంలో పడేసిన వర్మ..!

‘ఎన్టీఆర్’ కరుణిస్తాడా …? గందరగోళంలో పడేసిన వర్మ..!

తెలుగులో బయోపిక్ ల హవా సక్సెస్ ఫుల్ గా కొనసాగుతోంది. ఇప్పటికే అనేకమంది ప్రముఖుల జీవితాలు బయోపిక్ ల రూపంలో తెరకెక్కగా… వెండితెర మీద… రాజకీయ రంగంలోనూ…. సక్సెస్ ఫుల్ గా రాణించి ప్రపంచవ్యాప్తంగా… గుర్తింపు తెచ్చుకున్న విశ్వ విఖ్యాత నందమూరి తారక రామారావు జీవితం ఆధారంగా… ఇప్పుడు పోటా పోటీగా… బయోపిక్ లు తెరకెక్కుతున్నాయి. ఇప్పటికే నందమూరి బాలకృష్ణ ఆధ్వర్యంలో… ఎన్టీఆర్ ‘కధానాయకుడు ‘ విడుదలయ్యి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఆశించిన స్థాయిలో మాత్రం ఆ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది.

కానీ …బాలయ్య నిర్మిస్తున్న ఎన్టీఆర్ బయోపిక్స్ రెండూ టీడీపీకి కలిసొచ్చేలా తీస్తున్నారు అని ప్రచారం మొదలవ్వడంతో… ఎన్టీఆర్ వాస్తవ జీవితం ఇదే అంటూ… వివాదాల దర్శకుడు రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ పేరుతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధం అవుతున్నాడు.

బాలకృష్ణ క్రిష్ ల కాంబినేషన్ లో తెరకెక్కిన ఎన్టీఆర్ బయోపిక్ మొదటి పార్ట్ అనుకూల ఫలితాన్ని ఇవ్వకపోవడంతో… బాలయ్య బాగా నిరాశపడ్డాడు. ఆ సినిమా ఫలితాలు అందరికి షాక్ ఇచ్చాయి. దీంతో వర్మ దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్టీఆర్ మరో బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మీద జనాలు బాగా ఆశలు పెట్టుకున్నారు. ఈ సినిమా ట్రైలర్స్ చూస్తుంటేనే బాగా ఆసక్తి కలిగిస్తోంది.

కాకపోతే… ట్రైలర్ విడుదల సమయంలో హడావుడి చేసిన వర్మ ఎన్టీఆర్ ఇప్పుడు సైలెంట్ అయిపోయాడు. వర్మ ఎన్టీఆర్ విడుదల తేదీ విషయంలో ఎవరూ నోరు మెదపడంలేదు. అయితే ఈ సినిమాను మార్చి 15వ తేదీన విడుదల చేయాలని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ కు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. కానీ… వర్మ మాత్రం ఎందుకు సైలెంట్ అయ్యాడో మాత్రం ఎవరికీ తెలియడంలేదు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news