Gossipsరాం చరణ్ విష్.. అభయ్ కోసమా.. ఫ్యాన్స్ కోసమా..!

రాం చరణ్ విష్.. అభయ్ కోసమా.. ఫ్యాన్స్ కోసమా..!

స్టార్ హీరోల మధ్య ఈమధ్య సాన్నిహిత్యం పెరిగిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చరణ్, ఎన్.టి.ఆర్ ల మధ్య స్నేహం మరింత బలపడింది. సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటున్న ఈ ఇద్దరు తమ ఫ్యామిలీ సెలబ్రేషన్స్ ను కూడా షేర్ చేసుకుంటున్నారు. అందులో భాగంగా ఎన్.టి.ఆర్ కొడుకు అభయ్ రామ్ బర్త్ డేకు చరణ్ బర్త్ డే విషెష్ అందించడమే కాకుండా ఓ సర్ ప్రైజ్ గిఫ్ట్ కూడా పంపించాడట.

దాని గురించి ఓ స్పెషల్ వీడియో పెట్టాడు రాం చరణ్. ఎన్.టి.ఆర్ తనయుడికి విష్ చేస్తూ తాను పంపించిన గిఫ్ట్ నాన్నని అడిగి తీసుకో అని చెప్పాడు. దానికి ఎన్.టి.ఆర్ థాంక్స్ అని కూడా రిప్లై ఇచ్చాడు. మొత్తానిక్ స్టార్స్ మధ్య ఈ రిలేషన్ కొంతమంది ఫ్యాన్స్ కు ఆనందం కలిగిస్తున్నా నందమూరి ఫ్యాన్స్ ను బుట్టలో వేసేందుకే చరణ్ ఇలా చేస్తున్నాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఏది ఎలా ఉన్నా వీరిద్దరి రిలేషన్ మాత్రం అద్భుతంగా అనిపిస్తుంది.

అక్టోబర్ లో ఈ ఇద్దరు కలిసి భారీ మల్టీస్టారర్ లో నటిస్తున్నారు. రాజమౌళి డైరక్షన్ లో తెరకెక్కే ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 300 కోట్ల బడ్జెట్ అనుకుంటున్న ఈ సినిమాలో హీరోలిద్దరు అన్నదమ్ములుగా నటిస్తారని టాక్.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news