Moviesఆ స్టార్ డైరెక్టర్ అలా అన్నందుకే ‘ధృవ’ సినిమా చేశా :...

ఆ స్టార్ డైరెక్టర్ అలా అన్నందుకే ‘ధృవ’ సినిమా చేశా : రామ్ చరణ్

Ram Charan Tej shares an interesting topic of his in Dhruva Salute meet. He told that one star director inspired him to choose different story like Dhruva. Find out in below article who is that director.

ఈనెల 9వ తేదీన ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ధృవ’ సినిమా అంచనాలకు తగ్గట్టుగానే మంచి విజయం సాధించింది. డీమోనిటైజేషన్ ఎఫెక్ట్‌ని ధీటుగా ఎదుర్కొని, రెండు వారాల్లోనే రూ.50 కోట్లకుపైగా షేర్ కలెక్ట్ చేసింది. దీంతో.. చిత్రబృందం ప్రేక్షకులకు సెల్యూట్ చేస్తూ ఓ కార్యక్రమం నిర్వహించింది. ఈ ఈవెంట్‌లో భాగంగా చరణ్ కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు.

‘నేను రికార్డులు, నెంబర్ల (కలెక్షన్స్) గురించి పట్టించుకోను. అలా ఆలోచిస్తూ కూర్చుంటే.. ఏమీ చేయలేం. మంచి కథలను కూడా వదులుకోవాల్సి వస్తుంది. ఒకసారి మణిరత్నంగారితో మాట్లాడినపుడు.. వైవిధ్యమైన కథల్ని వింటూ ఉండమని ఆయన నాకు చెప్పారు. ఆ మాట నా మనసులో విత్తనంలా పడింది. ఇప్పుడు ‘ధృవ’ సినిమాను అంగీకరించడానికి కూడా అదే కారణం’ అని చెప్పుకొచ్చాడు.

ఇంకా చెర్రీ ఏమన్నాడటంటే.. ‘మా మామ అల్లు అరవింద్‌తో కలిసి సినిమా చేసిన ప్రతి సారీ మా అమ్మ చాలా ఆనందపడుతుంది. ‘మగధీర’ తర్వాత మరో సినిమా చేయాలని నేను, మావయ్య నాలుగేళ్లుగా అనుకుంటుంటే.. అది ఇప్పటికి కుదిరింది. అలాగే సురేందర్ దర్శకత్వంలో చేయాలని కూడా ఎప్పట్నుంచో చేయాలనుకుంటున్నా.. ‘ధృవ’తో అది కూడా తీరింది’ అని చరణ్ చెప్పాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news