Gossips#RRR రామ్ చరణ్ హింట్ ఇచ్చేశాడు.. సీక్రెట్ రివీల్ అయిపోయింది..!

#RRR రామ్ చరణ్ హింట్ ఇచ్చేశాడు.. సీక్రెట్ రివీల్ అయిపోయింది..!

రాజమౌళి ఎనౌన్స్ చేసిన ఎన్.టి.ఆర్, రాం చరణ్ మల్టీస్టారర్ సినిమాపై రోజుకో న్యూస్ సంచలనంగా మారుతుంది. సినిమా కథ ఇది అంటూ ఇప్పటికే రెండు మూడు కథలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి. అయితే రీసెంట్ గా రాం చరణ్ రిలీజ్ చేసిన బాక్సింగ్ వీడియోతో ఈ వార్తలు మరింత పెరిగాయని చెప్పొచ్చు.

ట్రిపుల్ ఆర్ సినిమా ఓ స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ తో వస్తుందని మొదట్లో అన్నారు. కాని ఆ తర్వాత కథ అది కాదని చెప్పుకొచ్చారు. కాని రీసెంట్ గా ఎన్.టి.ఆర్ ఫిట్ నెస్ ఛాలెంజ్ ను స్వీకరించి తన బాక్సింగ్ వీడియో పెట్టాడు రాం చరణ్. ఫిట్ నెస్ కోసం అలా చేస్తున్నాడని అనుకున్నా ఈ బాక్సింగ్ వర్క్ అవుట్స్ చూసి రాజమౌళి ట్రిపుల్ ఆర్ సినిమా కోసం చరణ్ అది ట్రై చేస్తున్నట్టుగా చెప్పుకుంటున్నారు.

రాం చరణ్ పోలీస్, ఎన్.టి.ఆర్ గ్యాంగ్ స్టర్ గా కనిపిస్తాడని వచ్చిన వార్తలన్ని మళ్లీ డైలమాలో పడేలా చేశారు. అక్టోబర్ నుండి సెట్స్ మీదకు వెళ్లనున్న ఈ సినిమాను డివివి దానయ్య నిర్మిస్తున్నారు. 200 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా తెలుగు, తమిళ, హింది భాషల్లో తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news