అద్భుతం.. అమోఘం.. అనిర్వచనీయం.. మహేష్ రామ చరణీయం..!

యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ బర్త్ డే సందర్భంగా అభిమానుల హంగామా నిన్న సాయంత్రం నుండే మొదలవగా ఈరోజు స్టార్స్ తమ విశెష్ తో సర్ ప్రైజ్ చేశారు. ముందుగా సూపర్ స్టార్ మహేష్ హ్యాపీ బర్త్ డే తారక్.. విష్ యు ఆ విక్టరీస్.. లవ్ అండ్ ఎవరీ థింగ్ అని పెట్టగా దానికి కొద్ది నిమిషాల్లోనే ఎన్.టి.ఆర్ థ్యాంక్స్ మహేష్ అన్న అని రిప్లై ఇచ్చాడు.

మహేష్ భరత్ అనే నేను సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నుండి ఎన్.టి.ఆర్, మహేష్ ల అన్నదమ్ముల బంధం బలపడింది. ఇక ఆ క్రమంలోనే ఎన్.టి.ఆర్ బర్త్ డేకు మహేష్ ట్వీట్ చేయడం దానికి అదేవిధంగా తారక్ రెస్పాండ్ అవడం జరిగింది.

ఇక మరోపక్క రాం చరణ్ కూడా హ్యాపీ బర్త్ డే బ్రదర్ రాబోయే సంవత్సరం వండర్ ఫుల్ గా ఉండాలని మెసేజ్ పెట్టాడు. ఇక ఉపాసన అయితే పూల బొకేని ట్వీట్ చేస్తూ తారక్ కు బర్త్ డే విశెష్ తెలిపింది. ఇక వీరికి కూడా థ్యాంక్స్ చరణ్ అండ్ ఉపాసన ఫ్లవర్స్ చాలా నచ్చాయి.. చీర్స్ అని రిప్లై ఇచ్చాడు.

ఇక నిన్నటి నుండి ట్విట్టర్ లో తారక్ బర్త్ డే సంబరాలు మొదలయ్యాయి. ముఖ్యంగా హ్యాష్ ట్యాగ్ హ్యాపీ బర్త్ డే ఎన్.టి.ఆర్ (#HappyBirthdayNTR) ట్విట్టర్ లో ట్రెండింగ్ అయ్యింది. 24 గంటల్లో 2 మిలియన్ (20 లక్షల) ట్వీట్స్ తో సంచలనం సృష్టించారు ఎన్.టి.ఆర్ అభిమానులు.

Leave a comment