Moviesచెర్రీ మెగా రికార్డ్.....ఐదో వారం తర్వాత ఓవర్సీస్‌లో థియేటర్స్ పెరిగాయి!!

చెర్రీ మెగా రికార్డ్…..ఐదో వారం తర్వాత ఓవర్సీస్‌లో థియేటర్స్ పెరిగాయి!!

ఈ రోజుల్లో ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ సినిమా అయినా కూడా రెండో వారం నుంచే థియేటర్స్ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. ఇక ఓవర్సీస్ సంగతి చెప్పనవసరం లేదు. మూడు రోజుల వీకెండ్ తర్వాత నుంచే థియేటర్స్ సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది. అలాంటిది మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘ధృవ’ సినిమా మాత్రం ఐదో వారం తర్వాత థియేటర్స్ సంఖ్యను పెంచుకుంది. ఈ సినిమాకు ఓవర్సీస్‌లో ఉన్న డిమాండ్ దృష్ట్యా స్క్రీన్స్ సంఖ్యను పెంచారు.

గత వారంలో 25 స్క్రీన్స్ పెరిగాయి. అదే చాలా మందిని ఆశ్చర్యానికి గురి చేసింది. అంతకంటే ఆశ్ఛర్యకరమైన విషయం ఏంటంటో ఈ వారం అంతకంటే ఎక్కువ సంఖ్యలో థియేటర్స్ పెరిగాయి. ఇప్పటి వరకూ ధృవ సినిమా ఓవర్సీస్‌లో 1.55 మిలియన్ డాలర్లు సంపాదించింది. ఇప్పుడు స్క్రీన్స్ పెరుగుతున్న ఊపు చూస్తుంటే ఈజీగా రెండు మిలినయన్ల డాలర్ల క్లబ్‌లో చేరేలా ఉంది. ఓవరాల్‌గా ఓవర్సీస్ ధృవ కలెక్షన్స్ 1.3 మిలియన్ డాలర్లు వస్తాయని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేశారు. అయితే వాళ్ళ అందరి అంచనాలనూ తల్లకిందులు చేస్తూ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ తన పవర్ చూపించాడు. ఓవర్సీస్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేశాడు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news