Movies84 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ‘ధృవ’

84 ఏళ్ల టాలీవుడ్ చరిత్రలో అరుదైన రికార్డ్ క్రియేట్ చేసిన ‘ధృవ’

Ram Charan’s latest movie Dhruva has created sensational record in 84 history of Tollywood by collecting 51 crore shares in just 12 days of run around the world.

తమ చిత్రానికి భారీ వసూళ్లు రావాలనే ఉద్దేశంతో దర్శకనిర్మాతలు ఏదైనా పండుగ సందర్భంగా లేదా సెలవుల రోజుల్లో విడుదల చేస్తారు. పైగా.. వాటికి ముహూర్తాలు కూడా ఫిక్స్ చేసుకుంటారు. ఫలానా సీజన్‌లో రిలీజ్ చేస్తే కలెక్షన్లు వస్తాయా? రావా? అని జోస్యం కూడా చెప్పించుకుంటారు. అన్నీ కుదిరాకే.. చివరికి తమ సినిమాని రిలీజ్ చేస్తుంటారు. కానీ.. తొలిసారి అలాంటి పట్టింపులు లేకుండా రామ్ చరణ్ ‘ధృవ’ సినిమాని రిలీజ్ చేయగా.. అది చరిత్ర సృష్టించింది. 84 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీలో ఏ మూవీ సాధించని అరుదైన ఘనతని సొంతం చేసుకుంది.

సాధారణంగా తెలుగు చిత్రపరిశ్రమలో ఓ సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. డిసెంబర్‌లోని తొలి మూడువారాలు సినిమాలకు అంతగా అనుకూలం కాదని ప్రగాఢ నమ్మకం. అందుకే.. ఆ సమయంలో తమ సినిమాల్ని రిలీజ్ దర్శకనిర్మాతలు ఎట్టి పరిస్థితుల్లోనూ రిలీజ్ చేయరు.. చేయడానికి ఇష్టపడరు. గతంలో రెండు, మూడు సినిమాల్ని రిలీజ్ చేయగా.. అవి రూ.25 కోట్ల (షేర్) మార్క్‌ని కూడా దాటలేకపోయాయి. ఈ దెబ్బకు డిసెంబర్‌లో మొదటి మూడువారాల్లో తమ సినిమాని రిలీజ్ చేయకూడదని దర్శకనిర్మాత హృదయాల్లో ముద్రపడిపోయింది. అయితే.. ‘ధృవ’ యూనిట్ వాటిని పట్టించుకోకుండా తమ సినిమాని డిసెంబర్ 9వ తేదీన రిలీజ్ చేసింది. ముందునుంచి భారీ అంచనాల్ని మూటగట్టుకోవడంతో.. ఇది కచ్చితంగా హిట్ అవుతుందని భావించారు. అనుకున్నట్లుగానే ఈ చిత్రం భారీ విజయం సాధించింది.

అంతేకాదు.. కేవలం 12 రోజుల్లోనే రూ.51 కోట్లు (షేర్) కొల్లగొట్టి.. ఔరా అనిపించింది. అది కూడా డీమోనిటైజేషన్ ఎఫెక్ట్‌ని ఎదుర్కొని.. ఆ రేంజులో వసూళ్లు రాబట్టడం నిజంగా విశేషం. దీంతో.. ‘ధృవ’ సునామీ ముందు టాలీవుడ్‌ని ఇన్నాళ్లూ వణికిస్తూ వస్తున్న ‘డిసెంబర్’ సెంటిమెంట్ కొట్టుకుపోయింది. 84 ఏళ్ల తెలుగు చిత్రపరిశ్రమలో ఈ అరుదైన ఘనత సాధించింది ‘ధృవ’ సినిమానే. మొత్తానికి.. ఈ మూవీ ద్వారా చరణ్ మంచి విజయం సాధించడంతోపాటు తన కెరీర్‌లో ఓ మైలురాయిగా నిలిచిపోయే అరుదైన ఘనత సాధించాడన్నమాట.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news