Newsతొలిచిత్రంతోనే 85 కోట్ల లాభం.. రామ్ చరణ్ తిరుగులేని రికార్డ్

తొలిచిత్రంతోనే 85 కోట్ల లాభం.. రామ్ చరణ్ తిరుగులేని రికార్డ్

నటుడిగా రామ్ చరణ్ ఎప్పుడో సక్సెస్ అయ్యాడు. మొదటి సినిమా ‘చిరుత’తో తండ్రికితగ్గ తనయుడిగా, రెండోచిత్రంతో ఇండస్ట్రీ ‘మగధీరుడిగా’ పేరుగాంచాడు.మధ్యలో కాస్త గాడి తప్పినా.. ‘ధృవ’తో తిరిగి లైన్‌లోకి వచ్చేశాడు. ఇప్పుడు సుకుమార్‌తో చేయబోతున్న ఓ డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీతో సంచలనం సృష్టించడానికి రెడీ అవుతున్నాడు. ఇలా యాక్టర్‌గా అంచలంచెలుగా ఎదుగుతున్న చెర్రీ.. తాజాగా మరో రంగంలో ఏ ఒక్కరూ సాధించని చారత్రిక రికార్డ్‌ని సృష్టించాడు. ఎందులో అనుకుంటున్నారా? ప్రొడక్షన్ రంగంలో!

తన తండ్రి మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ చిత్రమైన ‘ఖైదీ నెంబర్ 150’కి చరణ్ నిర్మాతగా వ్యవహరించిన సంగతి తెలిసిందే. ఆ మూవీతో నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టిన చెర్రీ.. ఊహించని రేంజులో లాభాలు ఆర్జించాడు. ట్రేడ్ వర్గాల లెక్కల ప్రకారం.. అక్షరాల రూ.85 కోట్లు లాభం వచ్చినట్లు తెలిసింది. ఆ చిత్రాన్ని రూ.35 కోట్ల బడ్జెట్‌తో నిర్మించిన చెర్రీ.. రూ.100 కోట్లకుపైగా థియేట్రికల్ రైట్స్‌ని అమ్మాడు. ఈ లెక్క ప్రకారం.. రూ.65 కోట్లు లాభం వచ్చింది. ఇక శాటిలైట్, హిందీ డబ్బింగ్ రైట్స్ అన్నీ కలుపుకుని మరో రూ.20 కోట్లు వచ్చినట్లు తేలింది. అంటే.. మొత్తం రూ.85 కోట్లు అన్నమాట. ఇలా నిర్మాణరంగంలోకి ఎంట్రీ ఇచ్చిన తొలిచిత్రంతోనే అంత లాభం అందుకున్న తొలినిర్మాతగా చరణ్ సెన్సేషనల్ రికార్డ్‌ క్రియేట్ చేశాడు. చెర్రీ బిజినెస్ మైండ్‌సెట్‌కి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news