రామ్ చరణ్ ‘గ్యాంగ్ లీడర్’.. బోయపాటి మూవీ పై సర్ ప్రైజ్ న్యూస్..!

ram-charan-gang-leader

మెగా పవర్ స్టార్ రాం చరణ్ రంగస్థలం హిట్ తో సూపర్ హిట్ అందుకోగా తర్వాత చేస్తున్న బోయపాటి శ్రీను సినిమాపై క్రేజీ న్యూస్ బయటకు వచ్చింది. సినిమాలో చరణ్ కు ముగ్గురు అన్నయ్యలు ఉంటారట. వారెవరో కాదు తమిళ హీరో ప్రశాంత్, మరో హీరో నవీన్ చంద్ర, ఈవివి పెద్ద కొడుకు ఆర్యన్ రాజేష్ లు నటిస్తున్నారట.

సినిమాలో గ్యాంగ్ లీడర్ గా చరణ్ కనిపిస్తాడని అంటున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గ్యాంగ్ లీడర్ ఎంత పెద్ద హిట్ సినిమా అందరికి తెలిసిందే. అయితే ఇప్పుడు బోయపాటి శ్రీను సినిమాకు ఈ టైటిల్ ను పెట్టబోతున్నారని టాక్. సినిమా కథ అటు ఇటుగా అలానే ఉంటుందట. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ సినిమాలో కైరా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

జయ జానకి నాయకా సినిమా పర్వాలేదు అనిపించుకున్నా రాం చరణ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టాలని చూస్తున్నాడు బోయపాటి శ్రీను. అసలే రంగస్థలం క్రేజ్ లో చరణ్ ఆ మేనియా కొనసాగిస్తాడో లేదో చూడాలి.

Leave a comment