Moviesఎన్టీఆర్ రికార్డ్స్ ని చిత్తు చేసిన రాంచరణ్

ఎన్టీఆర్ రికార్డ్స్ ని చిత్తు చేసిన రాంచరణ్

మెగా పవర్ స్టార్ రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వస్తున్న సినిమా రంగస్థలం. సూపర్ హిట్ టాక్ తో దూసుకెళ్తున్న ఈ సినిమా ఓవర్సీస్ లో కలక్షన్స్ బీభత్సం సృష్టిస్తుంది. అంతేకాదు యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ జనతా గ్యారేజ్ రికార్డ్ ను సైతం రెండు రోజుల్లో క్రాస్ చేసింది. ప్రీమియర్స్ తోనే 1 మిలియన్ డాలర్స్ వసూళ్లతో సంచలనం సృష్టించిన రంగస్థలం సినిమా రెండు రోజుల్లోనే 1.9 మిలియన్ కలక్షన్స్ వసూళ్లు రాబట్టింది.

జనతా గ్యారేజ్ ఫుల్ రన్ లో 1.8 మిలియన్ డాలర్స్ వసూళు చేసింది. అంతేకాదు తెలుగు రెండు రాష్ట్రాల్లో ఈ సినిమా రికార్డ్ వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే 50 కోట్ల కలక్షన్స్ తో సంచలనం సృష్టించిన రంగస్థలం ఫుల్ రన్ లో రికార్డులు సృష్టించడం గ్యారెంటీ అని తెలుస్తుంది. ఓవర్సీస్ లో ఈ సినిమా జోష్ చూస్తుంటే నాన్నకు ప్రేమతో సినిమా 2.2 మిలియన్ రికార్డును సైతం ఇది క్రాస్ చేయడం గ్యారెంటీ అంటున్నారు.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news