Specialsఇప్పుడు నాకు 24...కానీ 18లో కూడా ఆ పని చెయ్యలేదు...

ఇప్పుడు నాకు 24…కానీ 18లో కూడా ఆ పని చెయ్యలేదు…

రకుల్ ప్రీత్ సింగ్ తెలుగు సినిమా ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు కలిగిన హీరోయిన్. ఈ అమ్మడు ఎవరి మొహం మీద అయినా నిజం మాట్లాడే అంత దైర్యం ఉన్న గడుసుది. అలాంటి ఈ అమ్మడు రీసెంట్ గా ఒక ఇల్లు కొనుక్కుంది… అంత వరకు బాగానే ఉంది…కానీ ఇప్పుడు ఆ ఇల్లు ఎవరు కొనిచ్చారు అనేదే హాట్ టాపిక్.

ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో అడిగిన ప్రశ్నకి అమ్మడు ఇలా చెప్పుకొచ్చింది….నా మనసుకి బాగా బాధ కలిగించే విషయం ఒకటి పబ్లిక్ లో ఉంది..అది నేను ఇల్లు కొన్నప్పుడు.. ‘రకుల్‌కు ఎవరో హీరో ఇల్లు కొనిచ్చాడు’ అని. ఆ విషయం మా తల్లితండ్రులు చూసి చాలా బాధపడ్డారు…నాన్న నాకు ఫోన్‌ చేసి ‘అలా ఎలా రాస్తారు’ అని అనగానే అది విని నేను షాక్ తిన్నా.

కొత్త ఇంటికి పేపర్‌ వర్క్‌, లోన్‌ వర్క్‌ అంతా నాన్నే దగ్గర ఉండి చూసుకున్నారు. ‘నా బిడ్డ మొదటిసారి కొంటున్న ఇల్లు. అది కూడా తను కష్టపడి సంపాదించుకున్న డబ్బుతో కొన్నది’ అని ఆయనకు ఉంటుంది. నా కుటుంబం ఏమీ కోటీశ్వరుల కుటుంబం కాదు. నేను కోట్లలో పుట్టి పెరగలేదు. నాన్న శాలరీ మీదే మా కుటుంబం గడిచేది. అలాంటి ఓ కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి 24 ఏళ్ల వయసులో సొంతంగా ఇల్లు కొనడం గొప్ప విషయంగా చెప్పుకోవాలి. నాకు పద్దెనిమిదేళ్లు దాటిన తర్వాత మా పేరెంట్స్‌ నుంచి కూడా నేను డబ్బులు తీసుకోలేదు.

రక్షాబంధన్‌కు ఏం కావాలని మా బ్రదర్‌ అడిగితే కూడా .. ‘నాకేం వద్దు.. నువ్వు దాచుకో చాలు’ అని చెప్పా! ఒకవేళ నాకు అలాంటి మూడు కోట్ల విలువైన గిఫ్ట్‌ ఇచ్చే బాయ్‌ఫ్రెండ్‌ ఉంటే నేను ఎందుకింత కష్టపడాలి..నేను గర్వంగా ఫీలవుతానే తప్ప.. దాన్ని తీసుకోను. ఉదయాన్నే లేవడం, జిమ్‌కి వెళ్లడం, షూటింగ్స్‌కి వెళ్లడం, ఫుడ్‌ రిస్ట్రిక్షన్స్‌ ఇవన్నీ ఎందుకు? కానీ, నా వ్యక్తిత్వాన్ని కించపరిచేలా.. అలాంటి గాసిప్స్‌ రాయడం దారుణం.

మ‌రిన్ని సినిమా వార్త‌ల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి

Latest news